You are here
Home > Latest News > సొల్లు ముచ్చట్లు ఇకనైనా ఆపండి జీవన్ రెడ్డి.

సొల్లు ముచ్చట్లు ఇకనైనా ఆపండి జీవన్ రెడ్డి.

Spread the love
  • సొల్లు ముచ్చట్లు ఇకనైనా ఆపండి జీవన్ రెడ్డి.
  • తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదు. అక్కడ ప్రాజెక్ట్ ఎందుకు?.
  • నీటి లభ్యత లేదని లైడార్ సర్వేతో తేల్చారు మర్చిపోయావా జీవన్.
  • అందుకే మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించడం జరిగింది.
  • అదనపు భారం పడినా.. అంతకు డబుల్ ప్రయోజనం చేకూరుతుంది.

తమ్మడిహట్టి వద్ద ప్రాజెక్ట్ కడితే.. అది మరో శ్రీరామ్ సాగర్ అవుతుంది తప్ప.. దాని వల్ల దమ్మిడి ప్రయోజనం ఉండదు జీవన్ రెడ్డి. ఈ విషయం మేం చెప్పడం లేదు. కేంద్ర జలవనరులశాఖే దీన్ని ధృవీకరించింది. అందుకే మేడిగడ్డ వద్దకు ప్రాజెక్ట్ మార్చారు. మేడిగడ్డ దగ్గర 200 రోజులు నీటి లభ్యత ఉంటోంది. అంతేకాదు.. అక్కడి నుంచి రోజూ మూడు టీఎంసీలు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలుగా ఆలోచించి.. నిపుణుల సలహాలు తీసుకుని.. ప్రాణహిత చేవేళ్లను.. కాళేశ్వరంగా రీ డిజైన్ చేయడం జరిగింది జీవన్ రెడ్డి.

కాళేశ్వరం ప్రాజెక్ట్ శంకుస్థాపన నుంచి ప్రారంభానికి సిద్ధమైనా.. ఇంకా కాంగ్రెస్ నాయకులు విమర్శలు ఆపకపోవడం దుర్మార్గం. ప్రాణహితతో కేవలం 16లక్షల ఎకరాలకే ప్రయోజనం చేకూరుతుంది. కానీ.. కాళేశ్వరంతో దాదాపు 45లక్షల ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుంది. అటువంటప్పుడు..అంచనాలు పెరగడం తప్పేముంది. కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికే.. నేటికీ కాళేశ్వరంపై విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ జీవనధారగా మారబోతున్న కాళేశ్వరాన్ని ఇప్పుడు విమర్శించడం ద్వారా మీరు సాధించేది ఏమీ ఉండదు. ఇప్పటికే కోర్టుల్లో కేసులేసి ప్రజల్లో చులకన అయ్యారు. అందుకే అటు ప్రజలు, ఇటు నాయకులు కాంగ్రెస్ ను ఛీ కొడుతున్నారు.

మిస్టర్ జీవన్ రెడ్డి.. ఇప్పటికైనా మీరు తప్పు తెలుసుకోండి. కాళేశ్వరం మీద విమర్శలు ఆపి.. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరుగుతున్న వేళ ప్రభుత్వానికి సహకరించండి. కనీసం కొంచెమన్నా మీ పాప ప్రక్షాళన జరుగుతుంది.  ప్రాజెక్ట్ మీద ఎన్ని విమర్శలు చేసినా జనం మిమ్మల్ని పట్టించుకోరు. కోర్టుల్లో కేసులేసి కూడా అడ్డుకోలేకపోయిన సన్నాసులు.. ఇప్పుడు విమర్శులు చేసినంత మాత్రాన ఏం నష్టం రాదు.

Top