You are here
Home > Latest News > విపత్కర పరిస్థితుల్లో తన వ్యక్తిత్వంతో ఆదర్శప్రాయడవుతున్న సంతన్న..

విపత్కర పరిస్థితుల్లో తన వ్యక్తిత్వంతో ఆదర్శప్రాయడవుతున్న సంతన్న..

Spread the love
  1. నాయకుడంటే ముందుండి నడిపించేవాడు.ఆపదలో ఆప్యాయతలు పంచి వాడని మరోసారి నిరూపించిన ఎంపీ సంతోష్ కుమార్. 
  2. కరోన మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సొంత గన్ మెన్ పెళ్లికి వెళ్లలేక పోయినా వీడియోకాల్ చేసి ప్రేమను పంచిన వైనం. 
  3. టెక్నాలజీని ఉపయోగించుకోని సరికొత్త ప్రమాణాలను నిర్దేశించడం లో తనకు తానేసాటి నిరూపించుకున్న ఈ యువ సంచలనం. 
  4. విపత్కర పరిస్థితుల్లో తన వ్యక్తిత్వంతో ఆదర్శప్రాయడవుతున్న సంతన్న..
ఓవైపు కరోన మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న తరుణంలో గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి విజ్ఞప్తి మేరకు ఎక్కడ కూడా గుంపులుగుంపులుగా మంది హాజరు కావద్దు అని చెప్పడంతో,ఈ సందేశాన్ని  మరొక లెవెల్ తీసుకుపోవడానికి తెలంగాణ రాజ్యసభ సభ్యుడు మరోసారి కొత్త ప్రమాణాలను నిర్దేశించారు. అందులో భాగంగా తన సొంత గన్ మెన్ పెళ్లికి హాజరు కాలేకపోయినా కూడా వీడియో కాల్ చేసి తన ఆప్యాయత అనురాగాలను పంచడం జరిగింది.
నిజానికి ఇప్పుడున్న ఇటువంటి విపత్కర పరిస్థితులలో మొహమాటానికి పోయి పెళ్లిళ్లకు హాజరు అయ్యి వైరస్ ప్రభావం మరింత పెంపొందించేందుకు తోడ్పడే బదులు, ఇష్టమైన వారి మేలు కోరుకోవడం లోనే అసలైన ప్రేమను పంచడం అనే అర్థం ఉంది అని ఈ యువ సంచలనం మరోసారి నిరూపించడం జరిగింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఒక నాయకుడిగా ఉన్న ఎంపీ సంతోష్ కుమార్ నాయకత్వానికి సరికొత్త భాష్యం చెప్పే విధంగా ప్రవర్తిస్తున్న తీరు ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు. తన అడుగుజాడల్లోనే నడిచి వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గి తెలంగాణ ఆరోగ్య తెలంగాణ అయ్యేవరకు
స్వీయ నియంత్రణ లో ఉంటామని ప్రమాణాలు చేస్తున్నారు.
Top