You are here
Home > Latest News > సీఎం కేసీఆర్.. పట్టు వదలని విక్రమార్కుడు!

సీఎం కేసీఆర్.. పట్టు వదలని విక్రమార్కుడు!

Spread the love

పట్టు వదలని విక్రమార్కుడు ఎవరంటే.. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరును చెప్పేసేయొచ్చు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని పట్టు వదలకుండా పూర్తి చేయిస్తూ.. స్వీయ పర్యవేక్షణ చేస్తూ.. పనులను పరుగులు పెట్టిస్తూ.. అనుకున్న సమయానికే పూర్తి చేసేందుకు స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగారు.’

కాళేశ్వరం ప్రాజెక్టు.. కలలు తీర్చబోతోంది. వచ్చే ఏడాది నాటికి పంటలకు నీళ్లు అందించేందుకు శరవేగంగా సిద్ధమవుతోంది.

రాష్ట్రానికి జీవధారగా మారబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి.. ప్రాజెక్టు పరిధిలోని చెరువులను గోదావరి నీటితో నింపేలా కాల్వలు సిద్ధం చేయాలని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి కాళేశ్వరం నీరు అందుబాటులోకి వచ్చి తీరుతుంది ..

నిన్న రాత్రి కరీంనగర్ జిల్లా చేరుకున్న ముఖ్యమంత్రి… ఇవాళ తీరిక లేని షెడ్యూల్ లో గడపనున్నారు. ఉదయం 9 గంటలకు తీగల గుట్టపల్లి నుంచి హెలికాఫ్టర్ లో బయల్దేరతారు. 9.50 కి తుపాలకు గూడెం బ్యారేజీకి చేరుకుంటారు. 10.20 గంటలకు బ్యారేజ్ పనులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. 10.40 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ కు వెళ్తారు. 11 గంటల వరకూ మేడిగడ్డ పనులు పరిశీలిస్తారు. 11.15 గంటలకు కన్నెపల్లి పంప్ హౌజ్ కు వెళ్లి.. 11.45 వరకు అక్కడే పనులను సీఎం పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్నారం బ్యారేజ్ చేరుకోనున్న ముఖ్యమంత్రి.. 12.20 వరకు పనులను పరిశీలిస్తారు.

మధ్యాహ్నం 12.40 గంటలకు సిరిపురం పంప్ హౌజ్ కు వెళ్లి.. అక్కడే భోజనం చేయనున్నారు. 1.30 గంటల వరకు అక్కడే పనులనూ పరిశీలిస్తారు. తర్వాత.. 2 గంటలకు సుందిళ్ల బ్యారేజ్ కు చేరుకుని 2.20 గంటల వరకు అక్కడే ఉంటారు. 2.45 గంట వరకు గోలివాడ పంప్ హౌజ్ చేరుకుని.. 3.30 గంటల వరకు అక్కడే పనులు పర్యవేక్షిస్తారు.

సాయంత్రం 4.15 గంటలకు రామగుండం ఎన్టీపీసీకి చేరుకోనున్న ముఖ్యమంత్రి. అక్కడే రాత్రి బస చేయనున్నారు.

తర్వాత.. రేపు కూడా.. ముఖ్యమంత్రి ప్రాజెక్టుల సందర్శన కొనసాగనుంది. ఇంతలా.. ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు కాబట్టే.. ముఖ్యమంత్రి పనితీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. గతంలో జలయజ్ఞం అన్నారు.. ధనయజ్ఞంగా మార్చేశారు. తర్వాత.. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. తర్వాత పైసా కూడా ఇచ్చేది లేదంటూ వంకర మాటలు మాట్లాడారు. ఇదంతా.. ఉమ్మడి పాలకుల చరిత్ర.

కానీ.. ఇప్పుడు నడిచేది మన ముఖ్యమంత్రి, జన నాయకుడు కేసీఆర్ పాలన. అందుకే.. ఇచ్చిన హామీ ప్రకారం.. చెప్పిన మాట ప్రకారం.. ప్రాజెక్టులను స్వయంగా సీఎం కేసీఆరే పర్యవేక్షిస్తున్నారు. వాటిని మంత్రి హరీష్ రావు నాయకత్వంలో.. అధికారులు వడివడిగా పూర్తి చేయిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల ప్రజలు ముఖ్యమంత్రి పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జలవనరుల నిర్వహణలో.. గత ప్రభుత్వాలు కూడా.. ఇదే చిత్తశుద్ధిని చూపిస్తే.. తమ కష్టాలు తీరేవని.. ఇప్పటికే హాయిగా రెండు పంటలు వేసుకుని దర్జాగా గడిపేవాళ్లమని చెప్పారు. ఇప్పటికైనా ప్రజల కష్టాలు అర్థం చేసుకోగలిగే ముఖ్యమంత్రి.. ఇరిగేషన్ రంగాన్ని బాగు చేయడం ఆనందంగా ఉందని చెబుతున్నారు.
. ఈ ప్రాజెక్టులతో.. తమ ప్రాంతం సశ్యశ్యామలం కావడం ఖాయమని సీఎంకు నీరాజనాలు పలుకుతున్నారు. ఇలాగే.. సాగును బాగుగా చేసేందుకు ముఖ్యమంత్రి సారథ్యంలో తామూ శ్రమిస్తామని స్పష్టం చేస్తున్నారు.

త్వరలోనే.. రాష్ట్ర సాగు భూముల్లో జల సిరులు కురిపిస్తూ.. సర్కార్ అందించే 24 గంటల ఉచిత కరెంటును వినియోగించుకుంటూ.. రైతులు బంగారం పండించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖచిత్రాన్నే తమ స్వేదంతో మార్చేయబోతున్నారు.

Top