You are here
Home > Latest News > కాళేశ్వరం పర్యటనపై విషప్రచారం

కాళేశ్వరం పర్యటనపై విషప్రచారం

Spread the love

కాళేశ్వరం పర్యటనపై విషప్రచారం

కాలేశ్వరం సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఆయన ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేశారు. ఆ ప్రాజెక్టును ఒకటికి రెండు సార్లు సందర్శించి..నీటి నిల్వను పరిశీలించడంలో తప్పేంటి..? కానీ ప్రతిపక్షాలు, పనికిమాలిన పత్రికలు ఇందులో కూడా రాజకీయాలు వెతుకుతున్నాయి. కేసీఆర్ కు భక్తి ఎక్కువ. ఎక్కడకు వెల్లినా స్థానికంగా ఉన్న ఆలయాల్లో పూజలు చేస్తుంటారు. అలాగే తన కాలేశ్వరం పర్యటనలో ముక్తీశ్వర ఆలయంలో పూజలు జరిపారు.

దీనిపై ప్రతిపక్షాలు, గిట్టని పత్రికలు విషప్రచారం చేస్తున్నాయి. అయితే ఎవరెన్ని రకాల ప్రచారం చేసినా..ప్రజలు వాటిని నమ్మబోరు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు అహర్నిశలూ శ్రమించారు కేసీఆర్. కాలేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని లాంటిది. లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అందుకే కాలేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ మానస పుత్రికగా భావిస్తారు. గత ఏడాది ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.

ప్రాజెక్టులో మిగిలిన నిర్మాణ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తారు. ఆ క్రమంలోనే ఓసారి పనులు ప్రత్యక్షంగా పరిశీలించేందుకు, వేసవి ముందు మేడిగడ్డ బ్యారేజ్ లో ఎంత నీరు నిల్వ ఉందో చూసేందుకు సీఎం కాలేశ్వరం వెల్లారు. కాలేశ్వరమే కాదు..భారీ సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇతర అభివ్రుద్ధి కార్యక్రమాల పనులను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు. కొన్నిసార్లు ఆకస్మిక పర్యటనలు నిర్వహిస్తారు. ఆ క్రమంలోనే కాలేశ్వరం పర్యటన సాగింది.

కానీ ప్రతిపక్షాలు మాత్రం సీఎం పర్యటనకు, పూజలకు సంబంధం కలుపుతూ అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ తిరుపతి సహా ఎన్నో గుల్లను సందర్శించారు. ఎన్నో యజ్నయాగాదులు నిర్వహించారు. అవన్నీ…ఎందుకు చేస్తున్నారో..ప్రజలందరికీ చెప్పేచేశారు. ఏ పూజలనూ ఆయన రహస్యంగా నిర్వహించలేదు. సీఎం కేసీఆర్ తత్వం తెలిసి కూడా  ప్రతిపక్షాలు, సీఎం అంటే గిట్టని పత్రికలు కాలేశ్వరం పర్యటనపై కావాలని విషప్రచారం చేస్తున్నాయి.

 

Top