You are here
Home > Uncategorized > కేసీఆర్ కలల రూపానికి సజీవ కట్టడం.. కాళేశ్వరం

కేసీఆర్ కలల రూపానికి సజీవ కట్టడం.. కాళేశ్వరం

Spread the love

 

కాళేశ్వరం.. కలల జల ప్రపంచం.. ఇలలో ఇలా సాకారం!

– కేసీఆర్ కలల రూపానికి సజీవ కట్టడం.. కాళేశ్వరం

– లక్షల ఎకరాలను పచ్చగా మార్చిన జలబ్రహ్మ.. కాళేశ్వరం

– ప్రభుత్వ పనితీరుకు, చిత్తశుద్ధికి మచ్చుతునక.. కాళేశ్వరం

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రపంచంలోనే అతి పెద్ద బహుళార్ధసాధక ప్రాజెక్టు అన్నా..  55 లక్షల ఎకరాలకు ప్రాణం పోసిన జలబ్రహ్మ అని అన్నా.. 20 జలాశయాల్లో నీటి నిల్వ చేసి యావత్ తెలంగాణకు జీవన ప్రదాయినిగా మారిన ప్రాజెక్టు అని చెప్పినా.. ఎంత చెప్పినా.. ఎంత పొగిడినా.. కాళేశ్వరం గురించి ఇంకా చెప్పాల్సింది ఎంతో ఉంటుంది. అంతటి మహిమాన్వితమైన ప్రాజెక్టును సార్థకం చేసిన మహనీయుడు.. మన ముఖ్యమంత్రి కేసీఆర్.

ఆయనే చిత్తశుద్ధి చూపించకుంటే.. ఆయనే ఇంత నిక్కచ్చిగా వ్యవహరించకుంటే.. ఆయనే విపక్షాల దాడులను తట్టుకుని, కుట్రలు ఛేదించి, కేసులు ఎదుర్కొని ముందుకు వెళ్లకుంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు ఈనాడు ఇన్ని లక్షల ఎకరాలను ముద్దాడి ఉండేదే కాదు. ఇన్ని లక్షల మంది దాహార్తిని తీరుస్తూ ఉండేది కాదు. నది పల్లమెరుగు.. అన్న మాటనే కాళేశ్వరం రాకముందు వరకూ విన్నాం మనం.

కానీ.. నది పల్లాన్నే కాదు ఎత్తును కూడా ఎరుగు.. ఎత్తిపోతలతో అది సాధ్యమగు.. అని కేసీఆర్ ఏనాడో గ్రహించారు. తెలంగాణ వచ్చాక అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. సాగు బాగు బాధ్యత భుజాన వేసుకున్నాక ఆ ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఇబ్బందులన్నీ అధిగమించి.. ప్రాజెక్టును పూర్తి చేశారు. ఏకంగా.. 170 టీఎంసీల నీటిని నిబంధనల ప్రకారంగా వాడుకుని.. తెలంగాణ పుడమికి నిత్య జలాభిషేకాన్ని చేస్తున్నారు.

ఇంతటి పరిశ్రమను, ఇంతటి చిత్తశుద్ధిని మన ప్రతిపక్షాలు తప్ప.. యావత్ ప్రపంచమంతా గుర్తించింది. కీర్తించింది. అద్భుతమని ప్రశంసించింది. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత డిస్కవరీ ఛానల్ సైతం.. లిఫ్టింగ్ ఎ రివర్ పేరుతో.. సుదీర్ఘమైన డాక్యుమెంటరీని 6 అంతర్జాతీయ భాషల్లో ప్రసారం చేసింది. కాళేశ్వరం ఘనతను, నిర్మించిన కేసీఆర్ ప్రభుత్వ పనితీరులోని చిత్తశుద్ధిని, తెలంగాణ భూమి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటింది.

అందుకే.. కాళేశ్వరాన్ని చూసి తెలంగాణ మది ఉప్పొంగుతోంది. పచ్చదనం పరుచుకున్న పొలాలు, జలసవ్వళ్లు వినిపిస్తున్న చెరువులు, ప్రాజెక్టులు గర్వంతో తెలంగాణ అభివృద్ధి తీరును చాటి చెబుతున్నాయి. ప్రజల మొహాల్లో కనిపిస్తున్న ఆనందంలో.. ఈ అభివృద్ధి ఫలాలు స్పష్టంగా దర్శనమిస్తున్నాయి.

Top