You are here
Home > Latest News > మరోసారి కేసీఆర్ ఉద్యమ పంథా.. అండగా ఉంటున్నారు జనమంతా!

మరోసారి కేసీఆర్ ఉద్యమ పంథా.. అండగా ఉంటున్నారు జనమంతా!

Spread the love

మరోసారి కేసీఆర్ ఉద్యమ పంథా.. అండగా ఉంటున్నారు జనమంతా!

  • తాను బతికున్నంతవరకూ ప్రజలకు కష్టం రానివ్వనన్న కేసీఆర్
  • కరోనాపై చేస్తున్న యుద్ధంలో తానూ సైనికుడిగా మారిన ముఖ్యమంత్రి
  • కరీంనగర్ లో 50 వేల మందిని పరీక్షించగా నెగటివ్ ఫలితాలు రావడంపై ఆనందం

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు తెలంగాణకు జాతిపిత అయ్యారో.. ఎలా అరవై ఏళ్ల కలను సుసాధ్యం చేశారో.. మరోసారి తెలంగాణ ప్రజానీకానికే కాదు.. యావత్ భారతానికి, ఆపై యావత్ జగత్తుకు మరోసారి తెలియవచ్చింది. ఆయన ధ్యాస.. శ్వాస అంతా తెలంగాణే అని మరోసారి రుజువైంది. కరోనాపై చేస్తున్న యుద్ధంలో భాగంగా మాట్లాడుతూ.. తాను బతికి ఉన్నంత వరకూ తెలంగాణ ప్రజలకు కష్టం రానివ్వను అని కేసీఆర్ చెప్పిన మాట.. రాష్ట్ర ప్రజానీకం మనసును తాకింది. కేసీఆర్ అంటే ఏంటి.. ఆయన మనసు ఏంటి అన్నది మళ్లీ చాటి చెప్పింది.

ఇండోనేషియా బృందం కరీంనగర్ లో పర్యటించింది.. కరోనా వ్యాప్తి చెందించింది అని తెలియగానే ఆయన మనస్సు కకావికలమైంది. ఎలాగైనా ప్రజలను రక్షించుకోవాలన్న తపన, కసి కేసీఆర్ లో రగిలింది. ఆ ఫలితంగానే.. వంద వైద్య బృందాల ఏర్పాటు.. ఏకంగా 50 వేల మందికి పైగా వైద్య పరీక్షలు చేయించి.. తనలో ఇంకా సజీవంగా.. బలంగా ఉన్న ఉద్యమ నాయకుడి సత్తా ప్రపంచానికి తెలియవచ్చింది.

ఇంత చేసినా.. మరింత చేసేందుకు సిద్ధపడినా.. ఆయన ఎన్నడూ గుర్తింపు కోరుకోలేదు. ఎంత సేపూ తన తెలంగాణ బాగుండాలి.. తన తెలంగాణ ప్రజలు బాగుండాలి అన్న తపనే ఆయన మాటల్లో స్పష్టంగా కానవచ్చింది. “అవసరమైతే పేదలకు సరుకులు ఉచితంగా అందిస్తాం. నేను బతికున్నంతవరకూ పేదలకు కష్టం రానివ్వను. నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం” అని కేసీఆర్ ప్రకటించిన తీరుకు.. రాష్ట్ర ప్రజలు ముచ్చటపడుతున్నారు.

కేసీఆర్ ఉన్నంతవరకూ తమకు ఎలాంటి అధైర్యం లేదని.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టే కరోనాపై యుద్ధంలోనూ ఆయన మార్గదర్శకత్వాన్ని పాటిస్తామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ అడుగులో అడుగు వేస్తామని తేల్చి చెబుతున్నారు.

Top