You are here
Home > Uncategorized > కామారెడ్డి ప్రజల ముంగిట్లోకి అభివృద్ధి కాంతులు

కామారెడ్డి ప్రజల ముంగిట్లోకి అభివృద్ధి కాంతులు

Spread the love

కామారెడ్డి కళకళ.. జనంలో ఆనందపు హేల

– కామారెడ్డి ప్రజల ముంగిట్లోకి అభివృద్ధి కాంతులు

– ప్రారంభమైన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు

– ముఖ్యమంత్రి చేతుల మీదుగా వైభవంగా కార్యక్రమాలు

కామారెడ్డి కళకళలాడింది. ప్రజల మోము వెలిగిపోయింది. అభివృద్ధి కాంతులతో.. పట్టణమంతా పండగ వాతావరణం కనిపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన సమీకృత కలెక్టరేట్ భవనం, ఎస్పీ కార్యాలయాలు.. అభివృద్ధికి తార్కాణాలుగా ప్రకాశించాయి. విమర్శకుల నోళ్లు మూయించేలా.. ప్రజలందరితో శభాష్ అనిపించుకునేలా ప్రజాసేవకు కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు సర్వ సన్నద్ధమై అందుబాటులోకి వచ్చాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వహస్తాలతో ఈ కార్యాలయాలను కామారెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అందులో.. ప్రభుత్వానికి చెందిన 34 విభాగాల సమస్త సేవలు ఒకే ప్రాంతంలో లభ్యమయ్యేలా.. సమీకృత కలెక్టరేట్ భవనం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అడ్లూరు శివారులో.. 90 ఎకరాల సువిశాల ప్రాంగణంలో.. అన్ని శాఖల కార్యాలయాలతో పాటు.. అధికారుల నివాస గృహాలను సైతం ప్రభుత్వం నిర్మించింది.

అలాగే.. శాంతిభద్రతలకు జిల్లా స్థాయిలో ఎస్పీ కార్యాలయం ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం.. కామారెడ్డి ఎస్పీ కార్యాలయాలన్ని సుమారు 19 కోట్ల రూపాయలతో రాజభవనాన్ని తలపించేలా నిర్మించింది. రెండస్తుల్లో.. సకల సాంకేతిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. శాంతిభద్రతల్లో కీలకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్, సైబర్ ల్యాబ్ వసతులు ఇక్కడ ఉన్నాయి.

ఇలా.. పరిపాలనలో.. ప్రభుత్వ సేవల్లో అత్యంత కీలకమైన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా.. సకల వసతులతో తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. ప్రజలు మనసారా ఆశీర్వచనాలు పలుకుతున్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ.. కేసీఆర్ నాయకత్వాన్నే ఎన్నుకుంటామని.. మరింతగా.. దేశం గర్వించే అభివృద్ధి ఫలాలు సగర్వంగా అందుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Top