You are here
Home > Latest News > గల గలా తెలంగాణ.. సస్యశ్యామల తెలంగాణ!

గల గలా తెలంగాణ.. సస్యశ్యామల తెలంగాణ!

Spread the love

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన తీరుకు.. మంత్రి హరీష్ రావు లాంటి సమర్థుడు తోడైతే ఎలా ఉంటుంది.. అన్న ప్రశ్నకు.. గలగలమంటున్న రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు.. మమ్మల్ని చూడండి అంటూ జనాన్ని, దేశాన్ని మురిపిస్తున్నాయి. కుట్రలు ఛేదించి.. కుతంత్రాలు తట్టుకుని.. విపక్షాల తప్పుడు ప్రచారాలను ఎదుర్కొని.. ప్రాజెక్టు పనులను విజయవంతం చేయడం.. పంట పొలాలను పచ్చగా చేయడం.. ఎలాగో తెలుసుకోండి అంటూ.. తమ ప్రవాహాలతో.. తెలంగాణ నేలను పునీతం చేస్తున్నాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం 17 మేజర్.. 9 మీడియం ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇరిగేషన్ రంగానికి ఏటా ప్రభుత్వం 25 వేల కోట్లకు పైగా నిధులు కేటాయిస్తుండడంతో.. ఈ పనులన్నీ శరవేగంగా కొనసాగుతూ పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. దశాబ్దాల పాటు కాదు.. రెండు మూడేళ్ల వ్యవధిలోనే ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న సంకల్పాన్ని పెట్టుకోవడమే కాదు.. ఆ ఆలోచనను అమల్లోకి తెస్తూ ప్రాజెక్టుల ఏర్పాటును విజయవంతం చేయడంలో కేసీఆర్ సర్కార్ సమర్థంగా పని చేస్తుండడం కూడా.. జనానికి ఆనందం పంచుతోంది.

కాళేశ్వరం ఎత్తిపోతల.. పాలమూరు రంగారెడ్డి.. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు.. డిండి వరద కాలువ.. నెట్టెంపాటు.. దేవాదుల.. కోయిల్ సాగర్.. ఎల్ఎండీ.. కల్వకుర్తి.. మిడ్ మానేరు.. ప్రాణహిత.. తుపాకుల గూడెం.. బీమా.. సింగూరు.. శ్రీపాద ఎల్లంపల్లి సీతారామ ప్రాజెక్టులు.. శరవేగంగా పనులు పూర్తి చేసుకుంటున్నాయి. విపక్షాల కుట్రలు.. కేసులు తట్టుకుంటూ.. కేంద్రం నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అన్ని అనుమతులూ సాధించి.. ఉత్తర తెలంగాణను పచ్చటి మాగాణంగా మార్చేందుకు సిద్ధమవుతోంది.

రికార్డు సమయంలో పూర్తయిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకం.. ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలవడమే కాదు.. ఉన్న ప్రాజెక్టులను అనుకున్న సమయంలోపు పూర్తి చేసే దిశగా.. రాష్ట్ర ఇరిగేషన్ రంగానికీ ఊపునిచ్చింది. సీతారామ లాంటి ప్రాజెక్టులకు టెండర్లు పిలిపించే దశ నుంచి పనులు పూర్తి చేసే వరకూ అనుకున్న ప్రణాళిక ప్రకారం పనులు జరగడం.. జనానికి ఇరిగేషన్ ప్రాజెక్టులను చేరువ చేయడం.. సాగు తాగు నీటి రంగాన్ని పరిపుష్టం చేయడం.. సర్కార్ సత్తాకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఇతర ప్రాజెక్టులను కూడా సవాల్ గా తీసుకుంటున్న ప్రభుత్వం.. ఇచ్చిన మాట ప్రకారం.. వ్యవసాయాన్ని మరింత వృద్ధిలోకి తేవడంతో పాటు.. తాగునీటి కష్టాలు తీర్చేదిశగా ఉన్నతమైన ఫలితాలను సాధిస్తోంది.

 

Top