You are here
Home > Latest News > ముఖ్యమంత్రి మాటల్లో ఆవిష్కృతమైన బంగారు తెలంగాణ

ముఖ్యమంత్రి మాటల్లో ఆవిష్కృతమైన బంగారు తెలంగాణ

Spread the love

మార్పును తీసుకొచ్చారు. మంచిని అమలు చేస్తున్నారు. ఆదాయంలో నంబర్ వన్ గా నిలిచారు. దేశానికే ఆదర్శంగా నిలిచారు. పరిపాలనలో సంస్కరణలను అర్థవంతంగా అమలు చేస్తూ.. సంక్షేమ రంగంలో దిక్సూచిగా మారారు. ఇలా చెబుతూ పోతే.. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా విశిష్టతను వివరించేందుకు.. ఆయన నాయకత్వ గొప్పతనాన్ని, విశిష్టతను వర్ణించేందుకు సమయం సరిపోదు.

ఇండియా టుడే ఇంటర్వ్యూ సందర్భంగా ఇదే ఘట్టం ఆవిష్కృతమైంది. బంగారు తెలంగాన సాధన దిశగా తాను తీసుకున్న చర్యలు.. ఎలాంటివి.. వాటి అమలు ఎలా ఉంది అన్న పూర్తి విషయాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వివరించారు. సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు అన్ని సమాధానాలను కూలంకషంగా వివరించారు. విద్యుత్ రంగంలో సంస్కరణల నుంచి మొదలు పెడితే.. గొర్రెల పంపిణీ.. వ్యవసాయ సంస్కరణలు.. తొలిగన విద్యుత్ కష్టాలు.. పెన్షన్లు.. ఇతర సంక్షేమ కార్యక్రమాలపై మరోసారి తన విజన్ ను ఆవిష్కరించారు.

దీంతో.. రాష్ట్ర ప్రజలు కూడా.. ముఖ్యమంత్రి నాయకత్వ ప్రతిభను వేనోళ్ల కొనియాడుతున్నారు. నాయకుడంటే ఇలాగే ఉండాలని.. చెప్పిన మాటను అక్షరాలా అమలు చేసేవాడై ఉండాలని చెబుతున్నారు. అలా జరగకపోవడం తోనే.. గత కాలపు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలను నమ్ముకుని మోసపోయామని.. ఇకపై అలా జరగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చూసుకుంటారని జనం చెబుతున్నారు. ఇండియా టుడే ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చెప్పిన విషయాలు.. అద్భుతమని, వాస్తవాలని ప్రశంసిస్తున్నారు.

Top