You are here
Home > Latest News > సాహసానికి, ధైర్యానికి, త్యాగానికి చిరునామా కేసీఆర్!!

సాహసానికి, ధైర్యానికి, త్యాగానికి చిరునామా కేసీఆర్!!

Spread the love

– తెలంగాణ కోసం జీవితం అంకితం చేసిన మహనీయుడు

– మరోసారి అదే తెగువ, అదే ధైర్యం

– జీతీయ మీడియా కూడా ప్రశంసలు కురిపిస్తున్న తీరు

కేసీఆర్. ఆయన ఆశ, శ్వాస, ధ్యాస… అంతా తెలంగాణే. అవసరమైతే ప్రాణానికి తెగిస్తారు. తెలంగాణ కోసం గొంగడి పురుగునూ ముద్దాడుతారు. ఎందాకైనా వెళ్తారు. ఏకాభిప్రాయాన్ని సాధిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలకూ సిద్ధపడతారు. రాజకీయ జీవితాన్ని, అవకాశాలను కూడా త్యాగం చేస్తారు. సొంత రాష్ట్రాన్ని సాధించడం మాత్రమే కాదు. సాధించిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకూ అహరహం శ్రమిస్తారు.

అందుకే కేసీఆర్ అంటే.. తెలంగాణ ప్రజలకు ప్రాణం. అమితమైన ప్రేమ. అంతటి అభిమానాన్ని కాపాడుకునేందుకు కేసీఆర్ సర్వసన్నద్ధంగా ఉంటారు. తన పిల్లల కంటే… తన కుటుంబం కంటే మిన్నగా తెలంగాణ సమాజాన్ని ప్రేమిస్తారు. ఆరాధిస్తారు. ప్రజల బాగు కోసం పరితపిస్తారు. కాబట్టే… కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ నుంచి తెలంగాణను రక్షిస్తున్నారు.

ఇంకా 9 నెలల పరిపాలన సమయం ఉన్నా కూడా… కాంగ్రెస్ తో పాటు, ఇతర విపక్షాల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు తన ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసుకున్న తెగువ కేసీఆర్ సొంతం. ఇది చూసి దేశమే నివ్వెరపోతోంది. సాహసోపేత నిర్ణయాలకు ఎప్పుడూ వెనకాడని నాయకుడు కేసీఆర్ అని… జాతీయ మీడియా కూడా ప్రశంసిస్తోంది. తెలంగాణపై మన నాయకుడికి ఉన్న చిత్తశుద్ధిని చూసి అభినందిస్తోంది.

అయినా… కాంగ్రెస్ తో పాటు, టీడీపీ, తెలంగాణ జన సమితి, ఇతర పార్టీలు ఆయన్ను తప్పుబడుతున్నాయి. ఆ మహనీయుడి చిత్తశుద్ధిని శంకిస్తున్నాయి. తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయి. ఇవన్నీ… ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నిస్వార్థమైన రాజకీయాలు చేసే కేసీఆర్ ను మరోసారి తప్పక ఆశీర్వదిస్తామని… ముఖ్యమంత్రిని చేసి సంక్షేమాన్ని సాధించుకుంటామని తేల్చి చెబుతున్నారు.

Top