You are here
Home > Uncategorized > సారూ సక్కగ జెప్పిండ్రు మోడీ ప్రభుత్వం పోతేనే మన బతుకులు బాగు

సారూ సక్కగ జెప్పిండ్రు మోడీ ప్రభుత్వం పోతేనే మన బతుకులు బాగు

Spread the love

 

సారూ సక్కగ జెప్పిండ్రు

మోడీ ప్రభుత్వం పోతేనే మన బతుకులు బాగు

కేంద్ర చేస్తున్న అరాచాకాలు అన్యాయాల గురించి కేసీఆర్​ నిన్న చెబుతుంటే విన్నవారి రక్తం మరిగింది. మరీ అన్యాయమా అనిపించింది. రాష్ట్రాలను కన్నబిడ్డల్లా సాకాల్సిన కేంద్రం.. సవతితల్లిగా మారి సతాయిస్తోంది. అన్నం పెట్టిన కంచంలో ఉమ్మేసిన చందంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాల హక్కులను తుంగలో తొక్కుతోంది. ఒక్కటి మాత్రం నిజం బీజేపీపై గట్టిగా పోరాడకుంటే ఇక దేశం అథోగతి పాలు కావడం ఖాయం. ప్రాంతీయ పార్టీలన్నీ కేసీఆర్​తో నడచిరాకుంటే దేశ భవిష్యత్​ ప్రమాదంలో పడుతుంది. నిన్నటి బడ్జెట్​ ఒక పేద్ద జోక్​. బోగస్​ బడ్జెట్​. తలకాయ లేని బడ్జెట్​. తెలంగాణలో పారే కృష్ణా నదిని అనుసంధానం చేస్తామని తెలంగాణకు చెప్పకుండానే ప్రకటించడం ఏంటి ? తెలంగాణ ఇస్తామన్న ఒక్క హామీ గురించి మాట్లాడటం తప్పుకాదూ ?! గిరిజన వర్సిటీ, బయ్యారం ఫ్యాక్టరీ, కోచ్​ ఫ్యాక్టరీ..ఏ ఒక్క దాని ఊసులేదు. 40 కోట్ల మంది ఎస్సీ, ఎస్టీలకు 12,800 కోట్లట!

ఎరువుల సబ్సిడీలో 35 వేల కోట్ల కోత..రైతులకిది మోదీ బహుమతి. ఉపాధి హామీకి 25 వేల కోట్ల కోత..పేద కూలీలకిది మోదీ బహుమతి. ఆహార సబ్సిడీలో 65 వేల కోట్ల కోత..కరోనా టైం పేదలకు ఇచ్చిన బహుమతి.  ఐటీకి మినహాయింపు పెంపు లేదు.. ఉద్యోగులకిది మోడీ బహుమతి. 22కల్లా అందరికీ ఇళ్లన్నారు. మోడీ చెత్త విధానాల ఫలితంగా ఎంతో మంది రోడ్డు పాలయ్యారు. 22కల్లా రైతు ఆదాయం రెట్టింపన్నారు. కనీసం రైతు ధాన్య కొనడం లేదు. మద్దతు ధరకు దిక్కులేదు.

ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తానన్నారు.  పెట్రోలు, గ్యాస్​ సహా అన్ని వస్తువుల ధరల పెంచి జనం డబ్బును లాక్కున్నారు. నల్లధనమంతా తెస్తానని ఉన్నధనమంతా అంబానీలు, అదానీల చేతుల్లో పెట్టారు. 22కల్లా పది కోట్ల ఉద్యోగాలన్నారు. గత మూడు సంవత్సరాల నుంచి కనీసం కోటి మంది జాబ్స్​ పోయాయి. ఇలా చెప్పుకుంటే మోడీ ఘనతలు చాలా చాలా ఉన్నాయి.  ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వం దేశానికి చెప్పేవన్నీ అబద్ధాలేనన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలు వందశాతం నిజం. ఈ దేశాన్ని చెత్త ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం పరిపాలిస్తున్నది. అబద్ధాల్లో బతుకుతూ, మతపిచ్చి లేపుతున్నది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశ సమగ్రతను నాశనం చేస్తున్నది. మోడీ పాపాలు పండినయ్​. ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసమయం దగ్గరపడింది. ఇక థర్డ్​ఫ్రండ్​ మేల్కోవాలి.

Top