You are here
Home > Latest News > ఆందోళన వద్దు… ఉద్యోగాలు పోవు.. ఇది కేసీఆర్ మార్క్ భరోసా.

ఆందోళన వద్దు… ఉద్యోగాలు పోవు.. ఇది కేసీఆర్ మార్క్ భరోసా.

Spread the love

 

ఆందోళన వద్దు… ఉద్యోగాలు పోవు.. ఇది కేసీఆర్ మార్క్ భరోసా

  • –         కొత్త రెవెన్యూ చట్టంతో.. వీఆర్వోల వ్యవస్థ మాత్రమే రద్దు
  • –         ప్రస్తుత వీఆర్వోల ఉద్యోగాలకు ఏ మాత్రం ఢోకా లేదు
  • –         మరో విభాగంలో సర్దుబాటు చేస్తామని ముఖ్యమంత్రి భరోసా

వీఆర్వోల వ్యవస్థ రద్దుకు రంగం సిద్ధమైంది. ప్రతిపాదిత బిల్లు శాసనసభ ముందుకు వచ్చింది. ఇది తెలిసి… తమ ఉద్యోగాలు ఏమైపోతాయో అన్న ఆందోళన వీఆర్వోల్లో వ్యక్తమైంది. కానీ.. తన ఆగ్రహం అవినీతిపైనే అని.. ఎవరి పొట్ట కొట్టడం తన అభిమతం కాదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపించారు. ఎవరి ఉద్యోగాలు పోవని.. వీఆర్వోలందరినీ.. ఇరిగేషన్, పంచాయతీరాజ్ విభాగాల్లో సర్దుబాటు చేస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 5485 మంది వీఆర్వోలు ఉన్నారు. వారందరి పోస్టులు తాజా బిల్లు చట్టంగా మారితే.. కచ్చితంగా పోతాయ్. ఈ ప్రక్రియ.. కేవలం అవినీతిని అంతం చేయడానికి మాత్రమే అని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. ఆ క్రమంలోనే.. ఎవరి ఉద్యోగాలు తీసేయబోమని కూడా ముఖ్యమంత్రి చెప్పడంపై.. సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పైగా.. అర్హతల ఆధారంగా వారికి బాధ్యతలు కేటాయిస్తామని.. వారికి పే స్కేల్ కూడా ఇస్తామని చెప్పడంపై ప్రస్తుత వీఆర్వోల నుంచి సైతం.. ముఖ్యమంత్రి నిర్ణయానికి అభినందనలు, కృతజ్ఞతలు వ్యక్తమవుతున్నాయి.

ఇక్కడే.. రాజకీయ నిపుణులు ఓ విషయాన్ని బలంగా విశ్లేషిస్తున్నారు. వీఆర్వోలను రద్దు చేయడమంటే.. వారంతా అవినీతి పరులని కాదని.. అందులో కొందరు చేసిన పనుల కారణంగా.. ఇప్పటి పరిస్థితి వచ్చిందని వివరణ ఇస్తున్నారు. కాస్త ఆలోచిస్తే.. ఇది నిజమే అన్నట్టు.. ఇటీవల జరిగిన సంఘటనలు కూడా నిదర్శనంగా నిలుస్తున్నాయి. అందుకే.. ఇకపై ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అవినీతి లేకుండా పని చేస్తే.. ఉద్యోగాలు భద్రంగా ఉంటాయని కూడా చెబుతున్నారు.

ఈ విశ్లేషణను ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. అవినీతి వద్దని మాత్రమే కేసీఆర్ చెబుతున్నారని.. ఆయన మార్గదర్శకత్వంలో తెలంగాణ పురోభివృద్ధి సాధిస్తున్నట్టే.. ఉద్యోగులుకూడా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తే.. దేశం గర్వించదగ్గ మరిన్ని ఫలితాలను తెలంగాణ సాధిస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ దిశగా.. ప్రస్తుతం మాజీలు కాబోయే వీఆర్వోలు.. ఇతర సిబ్బంది.. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.

Top