You are here
Home > Latest News > కేసీఆర్ భయపడే రకం కాదు… భయపెట్టే రకం

కేసీఆర్ భయపడే రకం కాదు… భయపెట్టే రకం

Spread the love

కేసీఆర్ భయపడే రకం కాదు… భయపెట్టే రకం

–         మతి భ్రమించినట్టుగా బీజేపీ నేత వివేక్ మాటలు

–         ఎంఐఎంకు కేసీఆర్ భయపడుతున్నారంటూ కూతలు

–         కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎంఐఎం మాట ఎత్తని వివేక్

గాలి మారితే కూత మారినట్టు.. బీజేపీ నాయకుడు వివేక్ మాట్లాడుతున్నారు. ఎంఐఎం నేతలకు భయపడే ముఖ్యమంత్రి కేసీఆర్.. విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని అంటున్నారు. విమోచన దినం నిర్వహించామా లేదా అన్నది ఇక్కడ అసలు సమస్యే కాదు. ఎందుకంటే.. బానిసత్వం నుంచి.. దుర్మార్గాల నుంచి విముక్తి పొందడానికే.. ఆనాడు పోరాటం జరిగింది. అందుకే విమోచన దినోత్సవాన్ని నచ్చినవాళ్లు నచ్చినట్టుగా నిర్వహిస్తున్నారు. అలాగే.. తెలంగాణకు విముక్తి కల్పించిన జూన్ 2 ను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ప్రకటన వచ్చిన డిసెంబర్ 9న కూడా సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో.. ప్రతీదీ ఒక్కో నేపథ్యం ఉన్న సందర్భమే. అలాగని అన్ని సందర్భాలనూ అందరూ నిర్వహిస్తున్నారా అంటే.. లేదనే చెప్పాలి కదా. విమోచన దినోత్సవం కూడా అదే కోవలోకి వస్తుంది. అక్కడికీ… పార్టీ పరంగా ప్రతి ఏడాది వేడుక చేస్తూనే ఉన్నారు. అయినా… తప్పుబడుతున్నారంటే… వివేక్ ఇక్కడ రాజకీయం చేస్తున్నట్టే లెక్క. అదీ కాక.. ఎంఐఎంకు భయపడి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదనే మరో తెలివి తక్కువ వాదన ఒకటి.

కేంద్రాన్నే గడగడలాడించి… తెలంగాణ సాధించి ప్రపంచ వ్యాప్త దృష్టిని ఆకర్షించిన నాయకుడు మన కేసీఆర్. అలాంటి నాయకుడు ఓ చిన్న రాజకీయ పార్టీకి భయపడుతున్నారు అంటూ.. ఆ మాట అన్నవాళ్లనే ఉరికించి ఉరికించి రాజకీయాల్లోంచి తరిమేయాలి. వివేక్ విషయంలో పెద్దపల్లి ప్రజలు అదే పని చేశారు. అయినా ఆయనకు బుద్ధి రాలేదు. ఇందాక అనుకున్నట్టు.. గాలి మారితే కూత మారినట్టు.. బీజేపీ వాసన పీలుస్తున్న ఆయన.. తోటి నేతలు కూస్తున్నట్టే మాట్లాడుతున్నారు.

కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కనీసం ఆ ప్రస్తావన కూడా చేయని.. ఎంఐఎం గురించి మాట అనని వివేక్.. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే అది ఆయన అవివేకానికి నిదర్శనం కాకుంటే ఇంకేంటి మరి? వ్యాపారాలున్నాయ్. సంపాదన ఉంది. అన్నీ కాపాడుకోవడానికి రాజకీయాలు కావాలి. ఎక్కడ భద్రత ఉంటే అక్కడికి చేరే రకం. అలాంటి నాయకుడు.. ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే.. జనం ఎందుకు ఊరుకుంటారు చెప్పండి? అందుకే.. ఆయన్ను రాజకీయాల్లోంచి అడ్రస్ లేకుండా చేశారు. మరోసారి అలాంటి గుణపాఠమే చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. వివేకా… సిద్ధమేనా మరి.

Top