You are here
Home > Uncategorized > రాజగోపాల్ రెడ్డీ.. ఎమ్మెల్యేవా.. వీధి రౌడీవా?

రాజగోపాల్ రెడ్డీ.. ఎమ్మెల్యేవా.. వీధి రౌడీవా?

Spread the love

 

రాజగోపాల్ రెడ్డీ.. ఎమ్మెల్యేవా.. వీధి రౌడీవా?

– సంఘ విద్రోహ శక్తిగా ప్రవర్తిస్తుంటే.. పోలీసులు చూస్తూ ఊరుకోవాలా?
– ప్రజలను రెచ్చగొట్టడానికి ఎందుకంత ఉత్సాహం.. ఎందుకంత ఆరాటం?
– గెలిపించింది.. ఇందుకేనా? తప్పు చేసినవ్.. పోలీసులు బరాబ్బర్ అరెస్ట్ చేస్తరు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ.. పరిధి దాటి ప్రవర్తించకు. టీఆర్ఎస్ నేతలు కానీ.. ఎమ్మెల్యేలు కానీ.. ఎన్నడూ నీలా ప్రవర్తించలేదు. ఓ వీధి రౌడీలా తిరగలేదు. జనాన్ని రెచ్చగొట్టలేదు. కానీ.. నువ్వు చేసింది ఏంటి? ఓ పైలట్ ప్రాజెక్టు పథకాన్ని పట్టుకుని.. నీ నియోజకవర్గంలో కూడా అమలు చేయాలంటూ మంత్రిని నిలదీస్తానంటూ.. అలా బయలు దేరితే.. జనాలు ఏమనుకోవాలి నిన్ను చూసి? అంత అహంకారం.. ఆవేశం ఎందుకు?

నిజంగానే.. నిన్ను చూసి జనాలు కూడా రెచ్చిపోతే.. శాంతి భద్రతలు అదుపు తప్పితే.. అందుకు బాధ్యత ఎవరిది రాజగోపాల్ రెడ్డీ? ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించింది ఇలా రెచ్చగొట్టడానికేనా? ఒక్క విషయం గుర్తుంచుకో. దళిత బంధు అన్న పథకం.. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నారు. హుజూరాబాద్ లో అది ప్రారంభించడం అన్నది.. ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపించుకోవడంతో పాటు.. అణగారిన వర్గాలకు ప్రభుత్వం తరఫున మరోసారి భరోసా కల్పించడం కోసమే.

అక్కడ.. ఈ పథకాన్ని అమలు చేసి.. సాధ్యాసాధ్యాలు పరిశీలించి.. తర్వాత రాష్ట్రమంతా విస్తరించేందుకు కేసీఆర్ సర్కారు చిత్తశుద్ధితో ఉంది. గతంలో.. సాగుకు 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తామని ప్రకటించినప్పుడు కూడా నీలాంటి చిల్లర మూకలు ఇలాగే ప్రవర్తించాయి. కొందరైతే కల్లుతాగిన కోతిలా గంతులేశారు. కానీ.. ఆ పథకం ఇప్పుడు విజయవంతంగా రైతుల ఇంట సిరులు కురిపిస్తోంది. ఇప్పుడు.. దళిత బంధు సైతం అంతే విజయవంతం కాబోతోంది.

కాకపోతే.. ముందుగా.. హుజూరాబాద్ లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. కాలక్రమంలో పథకాన్ని ఇతర నియోజకవర్గాలకూ విస్తరించకుంటే.. నువ్వే కాదు.. ఏ అర్హుడైన దళితుడూ ఊరుకోడు. కాబట్టి.. కొన్ని రోజులు మూసుకుని కూర్చో. సంక్షేమాన్ని గమనించు. లోపాలు ఉంటే చెప్పు. కానీ.. ఇలా చిల్లర వేషాలు వేసి అరెస్టై.. తప్పు ప్రభుత్వానిది అంటే.. మర్యాదగా ఉండదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ. జాగ్రత్త.

Top