You are here
Home > Latest News > మోసాలైతే ఇంత ఆర్థిక వృద్ధి సాధ్యమా కోమటిరెడ్డీ?

మోసాలైతే ఇంత ఆర్థిక వృద్ధి సాధ్యమా కోమటిరెడ్డీ?

Spread the love

 

  • – అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ నేతలు
  • – అధికారమే పరమావధిగా విమర్శలు
  • – అడ్డగోలు కూతలతో పరువు పోగొట్టుకుంటున్న తీరు

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్ కు పెద్ద గుదిబండ కాబోతున్నారు. అదే పనిగా.. అడ్డగోలుగా విమర్శలు చేస్తే జనం సహించరని తెలిసి కూడా వెంకట్ రెడ్డి దగుల్బాజీలు.. ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మీడియాలో చోటు కోసం ఆరాటపడుతున్నారు. ఓ వైపు రేవంత్ రెడ్డి లాంటి రాజకీయ వ్యభిచారిని కాంగ్రెస్ అందలం ఎక్కిస్తూ ప్రచారానికి పంపిస్తుంటే.. అంతకంటే పెద్ద రాజకీయ బ్రోకర్ అయిన కోమటిరెడ్డి ఏమీ చేతకాక.. ఎటు చూడాలో తెలియక.. ముఖ్యమంత్రిని తిడితే కాస్త పాపులారిటీ వస్తుందేమో అని ఆరాటపడుతున్నాడు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఒక్కటీ కట్టించలేదని అంటున్న కోమటిరెడ్డీ.. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది గృహ ప్రవేశాలు నువ్వు చూడలేదా? అని జనం నిలదీస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ల బలోపేతంతో పాటు.. గురుకులాల ఏర్పాటుతో కేజీ టు పీజీ ఉచిత విద్య హామీని అద్భుతంగా అమలు చేస్తున్న తీరు అర్థం కావడం లేదా? అని కోమటిరెడ్డిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొమ్మును బొక్కిన కాంగ్రెస్ నేతలు మీరు.. ఇప్పుడు మళ్లీ అధికారం ఇస్తే 5 లక్షలకే ఇల్లు కట్టి ఇస్తామని చెబితే.. ఎలా నమ్మాలని అడుగుతున్నారు.

అందుకే.. ఇప్పటికైనా కోమటిరెడ్డి మారకుంటే.. నష్టపోయేది ఆయన మాత్రమే కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా. ఈ విషయాన్ని కాంగ్రెస్ కేడర్ స్పష్టంగా అధిష్టానానికి తెలియజేస్తోంది. అధికారం సంగతి పక్కన పెట్టండి.. కనీసం ప్రధాన ప్రతిపక్షమైనా దక్కుతుందో లేదో అన్న ఆందోళన కేడర్ లో కనిపిస్తోంది. కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి లాంటి లుచ్ఛాలను పార్టీ నుంచి గెంటేయాలన్న డిమాండ్ కూడా కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది.

Top