You are here
Home > Uncategorized > శవరాజకీయాలంటే ఇవే కోదండం

శవరాజకీయాలంటే ఇవే కోదండం

Spread the love

 

  • శవరాజకీయాలంటే ఇవే కోదండం
  • నీ మాటలతో అమరుల ఆత్మలు ఘోషిస్తయ్​
  • వాళ్ల కుటుంబాలను ప్రభుత్వాలు పట్టించుకోలేదనడం అన్యాయం

 

అమరుల కుటుంబాలకి ఇప్పటికీ ఆర్థిక సాయం అందలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం ఆరోపించాడు. ఆత్మహత్య చేసుకున్న వారికి పరిహారం చెల్లించలేదంటూ అర్థరహిత ఆరోపణలు చేశాడు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు, ఢిల్లీలో ఆందోళన చేసిన అమరులైన వారికి కేసీఆర్ పరిహారం చెల్లించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. అలాంటిది తన స్వరాష్ట్రంలో అమరులను వదిలేస్తాడా కోదండరామ్​ ? ఇలాంటి గలీజ్​ మాటలు మాట్లాడటానికి నీకు సిగ్గనిపించడం లేదా ? తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన వారిని బెయిల్​పై విడిపించింది తెరాస.

ఉద్యమిస్తున్న వారికి టెంట్లు, భోజనం, వాహనం వంటి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఈ విషయం నీకు స్పష్టంగా తెలుసు. అయినా పచ్చి అబద్ధాలు చెబుతున్నవ్​. లెక్క సరిగ్గా తెలియదు కానీ 600 లేదా 700 మంది మంది తెలంగాణ వాదులు మలి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పో యారు. కేసీఆర్‌ అమరుల కుటుంబాలను ఆదు కుంటామని చెప్తూ మొదటి అసెంబ్లీ సమావేశం లోనే బిల్లు పెట్టారు. ఆ తర్వాత జీఓ నంబర్‌ 80 విడుదలయింది.

దీనిలో అమరుల కుటుంబాల్లో అర్హులైనవారికి ఉద్యోగం ఇవ్వడం, రూ. 10 లక్షలు ధనసహాయం చేయడం, విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం, ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరుల కుటుంబాలకు గృహసముదాయం నిర్మించడం, అలాగే ప్రతి కుటుంబానికీ మూడెకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేయడం, రాజధాని హైదరాబాద్‌లో పెద్ద స్మారక స్తూపాన్ని నిర్మించడం వంటి విషయాలను ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు 576 మందికి ఉద్యోగం, పది లక్షల రూపాయల ధన సహాయం లభించింది. భారీ స్మారకస్తూపాన్ని నిర్మిస్తున్నారు.

మిగతా వారిని వివరాలు సరిగ్గా తెలియడం లేదు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారనే ఆరోపణలు రావడం మరొక కారణం. అందుకే వీరి విషయంలో ఆలస్యం జరుగుతోంది. 576 మందికి పరిహారం చెల్లించిన ప్రభుత్వం మిగతా వందో రెండు వందల మందికో పరిహారం చెల్లించకుండా ఉంటుందా ? తన స్వార్థ రాజకీయాల కోసం అమరవీరుల వ్యవహారాన్ని కోదండరామ్​ వాడుకుంటున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. ఇంతకూ అమరుల కోసం ఈ మాజీ ప్రొఫెసర్​ ఒక్క పైసా అయినా ఇచ్చాడా ?

Top