You are here
Home > Latest News > కోడెలది ఆత్మహత్యా? హత్యా?

కోడెలది ఆత్మహత్యా? హత్యా?

Spread the love

కోడెలది ఆత్మహత్యా? హత్యా?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు ఈ మధ్యాహ్నం మరణించారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అయితే ఆయనది నిజంగా ఆత్మహత్యేనా లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారా అనే అనుమానాలు చాలామందిలో కలుగుతున్నాయి. ఎందుకంటే కోడెల శివప్రసాదరావు రాజకీయ చరిత్ర చాల సుదీర్ఘమైనది. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హోమ్ మంత్రిగా, పంచాయితీరాజ్ మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా, రాష్ట్రం విడిపోయాక తొలి సభాపతిగా పనిచేసారు. ఆయనకు గొప్ప హస్తవాసి కలిగిన డాక్టర్ గా పేరుంది. కొద్దో గొప్పో ఫ్యాక్షనిస్టుగా కూడా ఆయనకు చెడ్డపేరు ఉన్నది. అలాంటి వ్యక్తి కేవలం జగన్ ప్రభుత్వం కేసులు పెట్టింది అనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గత ఐదేళ్లలో కోడెల కొడుకు, కూతురు “కె” టాక్స్ పేరుతో ప్రజలను పీడించి వందల కోట్ల రూపాయలను వసూలు చేశారు. ఆ కేసులన్నీ ఇప్పుడు కోడెల కుటుంబాన్ని చుట్టుముట్టాయి. దానికితోడు అసెంబ్లీ ఫర్నిచర్ ను తన ఇంటికి, షో రూమ్స్ కు తరలించారనే ఆరోపణలు కూడా ఆయన మీద వచ్చాయి. వాటిని కోడెల అంగీకరించారు కూడా. అయినప్పటికీ, కేసులను ఎదుర్కోలేనంత అధైర్యశాలి కాదు అని అందరి అభిప్రాయం.

అసలు కోడెల ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారణాలను లేఖ రూపంలో రాసిపెట్టి ఉండేవాడు. ఆయన అలాంటిది ఏమీ చెయ్యలేదు. పైగా ఆయన ఆత్మహత్య చేసుకోదలచుకుంటే అయన నరసరావుపేటలోనే చేసుకునేవారు. హైద్రాబాద్ లో ఎందుకు చేసుకుంటారు? ఈ మరణం వెనుక ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం మాత్రమే కాకుండా చంద్రబాబు హస్తం కూడా ఉన్నదని చాలామంది బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే, గత ఐదేళ్లలో జరిగిన అవినీతి, దోపిడీ మీద విచారణ జరిపిస్తామని జగన్ ఏనాడో ప్రకటించారు.

కోడెల లాంటి వ్యక్తిపై కూడా కేసులు పెడితే, ఏదో నాటికి తనమీద కూడా కేసులు పెడతాడని చంద్రబాబు భయపడ్డారని, కోడెలను ఏదోవిధంగా భూమి మీదనుంచి తప్పించి, జగన్ పెట్టిన కేసులవల్లనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని తన ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయిస్తే, తన మీద కేసులు పెట్టకుండా జగన్ ను భయపెట్టవచ్చు అనేది చంద్రబాబు పథకం కావచ్చని అనేకమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోడెల మరణించింది హైదరాబాద్ లో కాబట్టి ఆయన మరణం మీద తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపిస్తే నిజానిజాలు బయటకి వస్తాయి.

Top