You are here
Home > Latest News > నీ తాతలు దిగిరావాలె కోదండరాం.

నీ తాతలు దిగిరావాలె కోదండరాం.

Spread the love

 

ప్రజలు టీజేఎస్ ను నమ్మే పరిస్థితులు లేవు.

కాంగ్రెస్ తోక పార్టీ టీజేఎస్ అని అందరికీ తెలుసు.

నువ్వెన్ని మాయమాటలు చెప్పిన జనం నీ మాట వినరు కోదండరాం.

ప్రభుత్వం మెడలు ఒంచుతవా కోదండరాం. ప్రభుత్వం ఏం తప్పు చేసిందని మెడలు వంచుతవ్. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నందుకా?. అనతి కాలంలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని ప్రగతిని.. టీఆర్ఎస్ సాధించి చూపించినందుకు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నావా?. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తావా?. కాంగ్రెస్ తో రహస్య ఒప్పందాలు చేసుకుని.. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తోంది ఎవరో రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ తెలుసు. ప్రజలు నిన్ను.. నీ కళ్లబొల్లి మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరు.

ప్రభుత్వం మెడలు నువ్వు వంచుతావో.. లేక ప్రజలే నీ మెడలు వంచి అసెంబ్లీ బయటే నిలబెడతారో.. 2019లో తేలుతుంది. ముఖ్యమంత్రి అన్న గౌరవం, సోయి లేకుండా విమర్శలు చేస్తున్నావు. చదువుకోని వాళ్లకైతే.. పద్దతి, పాడు తెలియవు అనుకోవచ్చు. ప్రొఫెసర్ గా వెలగబెట్టినవ్ కదా?. ఎవరిని ఏ విధంగా గౌరవించాల్నో ఆ మాత్రం తెలియదా కోదండరాం. నీ ఊసర వెళ్లి నాటకాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో నువ్వు గానీ.. నీ టీజేఎస్ గానీ ఎట్టిపరిస్థితుల్లో నిలబడలేదు.

నువ్వు.. నీ పార్టీ నాయకులందరూ తలకిందులుగా తపస్సు చేసినా… కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేరు. నీకు ఓట్లేసినా.. కాంగ్రెస్ కు ఓట్లేసినా ఒకటే అనేది జనం అర్థం చేసుకున్నారు. అందుకే.. నీ పార్టీకి కిందిస్థాయి లీడర్లు లేక వెలవెలబోతోంది. టీఆర్ఎస్ వస్తున్న ప్రజాధరణకు జాతీయ పార్టీలే తట్టుకోలేకపోతున్నాయి. లింగులిటుకుమంటూ పదిమందిని వెంటేసుకుని వచ్చి,.. ప్రజలగుండెల్లో ఉన్న టీఆర్ఎస్ ను నువ్వేం చెయ్యగలవు కోదండ

Top