You are here
Home > Latest News > కోరా… పాఠాలు విద్యార్థులకు చెప్పు.. ప్రభుత్వానికి కాదు!

కోరా… పాఠాలు విద్యార్థులకు చెప్పు.. ప్రభుత్వానికి కాదు!

Spread the love

 

కోరాపాఠాలు విద్యార్థులకు చెప్పు.. ప్రభుత్వానికి కాదు!

  • జోక్యం చేసుకోం అని కోర్ట్ చెబితే.. అర్థాన్ని మారుస్తున్నావ్. నువ్వు ప్రొఫెసర్ వేనా అసలు?
  • సచివాలయాన్ని కొత్తగా కట్టవద్దు అని స్పష్టంగా ఏమీ చెప్పకున్నా వక్రభాష్యాలా?
  • న్యాయవ్యవస్థనే కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న ఇతడిని అరెస్టు చేయాల్సిందే

కోదండరాం ఏం చదువుకున్నరో తెలియదు గని.. రాజకీయంగా మాత్రం పదే పదే తప్పటడుగులు వేస్తూ మరింత చులకన అవుతున్నాడు జనానికి. అసలు విషయం ఏంటంటే.. ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు చెప్పిందే తప్ప.. పాత సచివాలయాన్ని కూల్చివేయవద్దని చెప్పలేదు అంటున్నాడాయన. కరెక్టే. కానీ.. సచివాలయం విషయంలోనే కదా.. కోర్టులో వాద ప్రతివాదనలు జరిగింది.

అలాగే.. ప్రస్తుత సచివాలయ భవనాన్ని కూల్చివేయవద్దని కోర్టు చెప్పలేదు అంటున్న కోదండరాం.. ఈ విషయం నీకు ఎందుకు అర్థం కావడం లేదు? కొత్త సచివాలయాన్ని కట్టవద్దు అని కూడా కోర్టు చెప్పలేదు కదా. మరి ఎందుకయ్యా అలా బట్టలు చింపుకుంటావ్? హైదరాబాద్ పూర్తిగా అభివృద్ధి చెందాక మాత్రమే ఇలాంటి పని చేయాలని అంటున్నావే. ఈ పాత భవనం అనుకోకుండా కూలిపోయి.. ఎవరైనా చనిపోతే.. గొడవ చేసేవాళ్లలో ఇలాగే మొదటివాడిగా ఉంటావ్.

ఆ మాత్రం జాగ్రత్త పడకుండా.. మాట్లాడుతున్న నువ్వు.. అసలు ఉద్యమ కారుడివి ఎలా అయ్యావో.. అంతకు ముందు ప్రొఫెసర్ వి ఎలా అయ్యావో పాపం.. నీ దగ్గర చదువు చెప్పించుకున్న ఖర్మానికి వారికే ఎరుక. ఇప్పటికిన్నా నీ తీరు అర్థం చేసుకో కోదండరాం. అడ్డగోలు మాటలు మాట్లాడి ఇంకింత ఇజ్జత్ పోగొట్టుకోకు. వాస్తవాలు గ్రహించు. పేదలకోసం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న మంచిని గుర్తించలేని మూర్ఖత్వంలో ఉంటే.. కనీసం నోరు మూసుకుని ఉండు.

లేదంటే.. న్యాయవ్యవస్థకే వక్రభాష్యం చెబుతున్న నిన్ను.. జైల్లో వేసి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలు కోరుతున్నారు. అందరికీ మంచిని పంచుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శించవద్దు అని హెచ్చరిస్తున్నారు. లేదంటే.. ఇప్పటికే రాజకీయాల్లో అడ్రస్ లేకుండా పోయిన చాలా మంది కాంగ్రెస్, టీడీపీ నేతల జాబితాలో కలిసిపోవుడైతే ఖాయం అన్న చాలా మంది వాదనను అయినా గమనించి బుద్ది కలిగి ఉండు.

Top