You are here
Home > Latest News > అదిరిందయ్యా కోమటి రాజా.. జోగీ జోగీ సామెతకు సరిగ్గా సరిపోయింది..!

అదిరిందయ్యా కోమటి రాజా.. జోగీ జోగీ సామెతకు సరిగ్గా సరిపోయింది..!

Spread the love

 

అదిరిందయ్యా కోమటి రాజా.. జోగీ జోగీ సామెతకు సరిగ్గా సరిపోయింది..!

– షర్మిల నాటకాల దీక్షకు.. పూనకాల కోమటిరెడ్డి మద్దతు

– వైఎస్ మనిషినే అని నిరూపించుకున్న రాజగోపాల్ రెడ్డి

– రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడిన లుకలుకలు

తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. సీనియర్ నాయకులుగా పేరున్న నేతల దారి.. ఎవరికి తోచినట్టు వారిదే.. అన్న విషయం మళ్లీ నిరూపితం అయ్యింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణ వేదికగా కొత్త నాటకం మొదలు పెట్టిన తెలంగాణ ద్రోహి రాజన్న బిడ్డ షర్మిల దీక్షకు.. కాంగ్రెస్ నుంచి ఇంతవరకూ ఎవరూ ఓపెన్ గా స్పందించకున్నా.. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. బహిరంగంగా మద్దతు సైతం తెలిపారు.

ప్రతి మంగళవారం దీక్ష అంటది. కాసేపు అలా ఫాస్టింగ్ చేసినట్టుగా కూర్చుని.. మీడియాలో చోటు కోసం ఆరాటపడ్తది. ఆ దీక్షకు దశ దిశ ఏంటిదో ఎవరికీ అర్థం కాదు. కానీ.. కాంగ్రెస్ లో ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కాని రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఆమె దీక్ష.. నచ్చినట్టుంది. తెలంగాణకు ద్రోహం చేసిన వైఎస్ అనుచరిడిగా తన గతాన్ని గుర్తు చేసినట్టు అనిపిస్తోంది. అందుకే.. దిల్లీలో ఉన్న రాజగోపాల్.. ఫోన్ చేసి మరీ.. షర్మిలకు సపోర్ట్ ఇచ్చిండు.

ఇదంతా చూస్తే.. కేసీఆర్ ను నిలువరించేందుకు తెర వెనక.. ప్రతిపక్షాలన్నీ ఒక్కటి అవుతున్న సంకేతం కనిపిస్తోంది. వేలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినా.. నోటిఫికేషన్లు జారీ చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నా.. ఆ చర్యలకు ఆటంకం కలిగేలా.. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా.. ఇలాంటి దుర్మార్గులు చేస్తున్న కుట్రలను ప్రజానీకం ప్రతి క్షణం ఓ కంట కనిపెడుతూనే ఉంది.

ఇలాంటి నేతలకు ఏ మాత్రం దారిచ్చినా నష్టపోయేది తెలంగాణ ప్రజలే. విపక్షాల ముసుగులో వాళ్లు చేస్తున్న అరాచకాలను మరింత మంది బహిరంగంగా వ్యతిరేకించాల్సిందే. ఎందుకీ కుట్రలను షర్మిల, కోమటిరెడ్డి వంటి నేతలను నిలదీయాల్సిందే. అలా కాకుంటే.. గతంలో కాళేశ్వరంపై, ఇతర పథకాలపై కేసులు వేసినట్టు.. ఉద్యోగాల భర్తీని కూడా అడ్డుకుంటరు ఈ తెలంగాణ ద్రోహులు. నిరుద్యోగులారా.. రాష్ట్ర ప్రజలరా.. ఇలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త.

Top