You are here
Home > Uncategorized > కొండపోచమ్మ ప్రజల కోసమే మల్లన్న.

కొండపోచమ్మ ప్రజల కోసమే మల్లన్న.

Spread the love

 

  • కొండపోచమ్మ ప్రజల కోసమే మల్లన్న.
  • కేవలం కేసీఆర్ కోసం కట్టలేదు.
  • 15టీఎంసీల నీళ్లు కేసీఆర్ ఏం చేసుకుంటారు.
  • హైదరాబాద్ లాంటి 15నగరాలకు సరిపోతాయి అవి.
  • కొంచెమన్నా జ్ఞానం ఉండక్కర్లేదా మాట్లాడేటప్పుడు.
  • ప్రాజెక్టులు అన్న తర్వాత.. వ్యయం కాకుండా ఎలా ఉంటుంది.

18మీటర్ల నుంచి 618మీటర్లకు గోదావరి నీళ్లను తీసుకురావడంలో ఎంతో శ్రమ ఉంది. కోట్లు ఖర్చు అయ్యాయి. కొండపోచమ్మ నీళ్లు బిస్లరీ వాటర్ కంటే కాస్ట్ అంటున్న తీన్మార్ మల్లన్న.. అవే నీళ్లు లేక కొన్ని వందల మంది ప్రాణాలొదిలారు. మరి ప్రాణాలకు లెక్క కట్టగలవా??. ఎకరాలకు ఎకరాలు భూములుండి కూడా.. నీళ్లు లేక వలసలు పోయారు. వెట్టి చాకిరి చేస్తున్నారు. కూలీ నాలి చేసి బిడ్డల్ని బతికించుకుంటున్నారు. ఎందుకీ ఖర్మ మనకు తలాపున గోదావరి ఉండగా.. అని.. సీఎం ఉక్కు సంకల్పంతో.. కొండపోచమ్మవరకు నీళ్లను తీసుకొచ్చారు.

50 ఏళ్లలో ఏ నాయకుడు చేయలేని ఘనతను సీఎం కేసీఆర్ సాధిస్తే.. కేవలం తన ఫాంహౌస్ కోసమే.. తన బంధు మిత్రుల కోసమే కొండపోచమ్మ సాగర్ నిర్మించారని.. నీచ్ కమీనే మాటలు మాట్లాడుతున్నావ్. చుట్టూ వేలాది ఎకరాల భూములకు కొండపోచమ్మ నీరు అందనుంది. కొన్ని వందల గ్రామాలకు సాగు, తాగు నీరు అందనుంది. కొన్ని మండలాలకు మండలాల రూపురేఖలు మారనున్నాయి. ఆలేరు దాకా నీళ్లు వెళ్తున్నాయి. రేపు హైదరాబాద్ కు తాగునీరు కూడా ఇదే కొండపోచమ్మ నుంచి అందించనుంది సర్కార్. ఇంత లాభం కళ్ల ముందు కనిపిస్తుంటే.. కేవలం కేసీఆర్ కోసమే ప్రాజెక్ట్ కట్టారనడం ఎంత దుర్మార్గం.

ప్రాజెక్టులు అన్న తర్వాత.. కోట్లు ఖర్చు కావడం అనేది కామన్. లిఫ్టులకు విద్యుత్ బిల్లులే ఎక్కువ అంటున్నవ్.. మరి లిఫ్టులు లేకుండా తెలంగాణకు గోదావరి నుంచి కానీ.. కృష్ణా నుంచి కానీ.. నీళ్లు తెచ్చే మార్గం ఉందా?. ఈ క్వశ్చన్ కు నీళ్లు నములుతవ్. నువ్వు మల్ల సీఎంను విమర్శిస్తవ్. కేవలం.. కాంగ్రెస్, బీజేపీ ఇస్తున్న ఫండింగ్ తో బతుకుతూ.. ఎకరాలకు ఎకరాలు కొనుగోలు చేస్తూ ముఖ్యమంత్రిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న మల్లన్న.. నీకు రోజులు దగ్గరపడ్డయ్.. జర్ర కరోనా అయిపోనీ.. నీలాంటోళ్ల సంగతి ప్రభుత్వం చూసుకుంటది.

Top