You are here
Home > Uncategorized > సందట్లో సడేమియాలా దూరుతున్న కొండ విశ్వేశ్వర్రెడ్డి…

సందట్లో సడేమియాలా దూరుతున్న కొండ విశ్వేశ్వర్రెడ్డి…

Spread the love
సందట్లో సడేమియాలా దూరుతున్న కొండ విశ్వేశ్వర్రెడ్డి…
ఈటల భూకబ్జాలకు వంత పాడుతున్న వైనం…
రాజకీయ జన్మనిచ్చిన టిఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే పుట్టగతులు ఉండవు…
ఉద్యమాల గురించి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణలో రెండు దశల్లో  లేచిన తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు జాడ పత్తా లేని ఆయన ఇప్పుడు మాత్రం ప్రజ ఉద్యమం నిర్మిస్తామని అనడం ఆయన అవివేకానికి నిదర్శనం. ఇక మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జాలపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవడంపై తెగ బాధపడిపోతున్నడు కొండ. తప్పు చేస్తే ఎంతటి వారైనా సీఎం కేసీఆర్ వదలనని ఇంతకుముందు ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు దాన్ని చేతల్లో చూపించారు.
నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో స్వయంగా ఈటల రాజేందర్  అసైన్డ్ భూముల్లో నిర్మాణాలు చేపట్టానని అంగీకరించాడు. ఎన్ని తప్పులు పెట్టుకొని ఈటల రాజేందర్ విషయంలో సమర్ధించడం కొండా విశ్వేశ్వర్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనం.
ఇక మంత్రి కేటీఆర్ ను సీఎంగా చేయనుండటంతో ఈటలను అడ్డు తొలగించాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడడం అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. మరోవైపు మంత్రి కేటీఆర్ సీఎం పదవికి అన్ని విధాలా అర్హుడని ఆయన తెలుసుకుంటే మంచిది. గత ఐదారేళ్లుగా మంత్రి కేటీఆర్ సమర్థతను తెలంగాణ ప్రజలు అందరూ చూశారు. ఆమోదించారు. ఇప్పటికిప్పుడు సీఎంగా మంత్రి కేటీఆర్ ను నియమించిన కూడా ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. నిజానికి స్వాగతిస్తారు.
అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటెల రాజేందర్ గురించి అవగాహన లేకుండా కూతలు కూస్తూన్నాడు. ఏదేమైనా ఈటల చేసిన భూ కబ్జాలపై మాట్లాడడం మానివేసి టిఆర్ఎస్ పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆయనను ప్రజలంతా తరిమి కొడతారు. మరోవైపు మాజీ ఎంపీ గా చలామణి అవుతున్న  రెడ్డికి ఆ పదవి టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్ ఇస్తే గమనిస్తే మంచిది. ఏమైనా పాలు తాగిన రొమ్ముని గుద్దిన కొండకరాజకీయ భవిష్యత్తు లేదని తెలుసుకుంటే మంచిది.
Top