You are here
Home > Latest News > దొంగ నోట్లన్నీ పోయాయని.. కాంగ్రెస్ నేతల కన్నీళ్లు!

దొంగ నోట్లన్నీ పోయాయని.. కాంగ్రెస్ నేతల కన్నీళ్లు!

Spread the love

చేసిన పాపం ఊరికే పోదంటారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు.. అచ్చంగా ఈ సందర్భానికి మంచి ఉదాహరణగా నిలుస్తున్నారు. గతంలో తమ చేతిలోనే ఉన్న పాలనను దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ నేతలు.. దొంగ ఓట్లను లక్షలాదిగా సృష్టించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. ఎన్నికల్లో లాభం పొందాలని చూశారు. కానీ.. కాలం తిరిగింది. న్యాయం గెలిచింది. కాంగ్రెస్ దుష్ట పన్నాగం ఇప్పుడు బయటపడింది.

ఒక్క ఎల్ బీ నగర్ నియోజకవర్గంలోనే.. లక్షకు పైగా ఓట్లు నకిలీవని తేలింది. అలాగే.. కుత్బుల్లాపూర్ లో 30 వేలు.. ముషీరాబాద్ లో 50 వేల ఓట్లు.. నకిలీవని తేలడంతో.. జాబితా నుంచి వాటిని తొలగించేశారు. ఇలా.. జాబితా నుంచి ఓటర్ల పేర్లు గల్లంతు అయ్యాయంటే.. దాని అర్థం అవన్నీ నకిలీవని నిరూపితం కావడమన్నట్టే. అలాగే.. ఆ నకిలీ ఓట్ల గురించి ఎవరైనా బాధ పడుతున్నారు అంటే.. వాటిని గతంలో తాము అధికారంలో ఉన్నపుడు సృష్టించినట్టే.

ఇదే లాజిక్ ను పట్టేయడంలో తప్పటడుగు వేసిన కాంగ్రెస్ మేధావులు.. సారీ.. మేతావులు.. ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఓట్లు గల్లంతు కావడంలో టీఆర్ఎస్ పాత్ర ఉందని అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. కానీ.. ఇవన్నీ.. తమ పాలననాటి నిర్వాకాలే అని జనాలు విమర్శించిన తర్వాత కానీ తెలుసుకోలేకపోయారు.

అలాగే.. ఓట్లు గల్లంతు అయినా.. కాకున్నా.. జనం మద్దతు అంటూ ఉంటే.. తామే గెలిచి తీరుతామన్న నమ్మకాన్ని కూడా వారు వ్యక్తం చేయలేకపోయారు. దీంతో.. ఓటమిని కాంగ్రెస్ నేతలు ముందే అంగీకరించినట్టు అవుతోంది. అలాగే.. తమ తప్పును తామే పరోక్షంగా అంగీకరించినట్టు కూడా అయ్యిందని జనం నిట్టూరుస్తున్నారు. ఇలా సెల్ఫ్ గోల్ చేసుకునే బదులు.. సంక్షేమాన్ని సమర్థించి.. పరిపాలనలో టీఆర్ఎస్ కు అండగా ఉంటే మేలు కదా.. అని కాంగ్రెస్ కు జనాలు సూచిస్తున్నారు.

Top