You are here
Home > Latest News > లాక్‌డౌన్‌లో అంద‌రికీ ఆద‌ర్శంగా ఎంపీ సంతోష్ కుమార్‌..

లాక్‌డౌన్‌లో అంద‌రికీ ఆద‌ర్శంగా ఎంపీ సంతోష్ కుమార్‌..

Spread the love

 

  • లాక్‌డౌన్‌లో అంద‌రికీ ఆద‌ర్శంగా ఎంపీ సంతోష్ కుమార్‌..
  • పిల్ల‌ల‌తో క్రికెట్ ఆడుతున్న తెలుగు ఎంపీ…
  • అంద‌రూ ఇంట్లోనే ఉండాల‌ని విజ్ఞ‌ప్తి..
  • సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని హిత‌వు..

ప్రపంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్  కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. బుధ‌వారం ఉగాది కావడంతో అందరూ ఇళ్లలోనే గడిపి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో తెలుగు ఎంపీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ తన ఇంట్లో క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపారు.

అంతకుముందు సంతోష్ కుమార్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు. తన కుటుంబ సభ్యులతో క్రికెట్ ఆడాలని తన డ్రీమ్ నెరవేరిందని పోస్ట్ చేశారు. ఎప్పుడు బిజీగా ఉండే తనకు కరోనా కారణంగా ఆటవిడుపుగా ఉంటుందని తెలిపారు. ఇంట్లో ఉండి  ఉగాదిని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఉగాది కొత్త సంవత్సరం మన జీవితాల్లో నూతన ఉదయాన్నే తీసుకురావాలని ఆకాంక్షించారు. తన పిల్లలతో క్రికెట్ ఆడుతున్న ఫొటోను ఈ సందర్భంగా సంతోష్కుమార్ ట్వీట్‌ చేశారు.

సంతోష్ చేసిన ప‌ని అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది.  సంక్షోభం నెల‌కొన్న ప‌రిస్థితులలో ఇంట్లోనే ఉండి, కుటుంబ స‌భ్యుల‌తో గ‌డిపి అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఇప్ప‌టికే గ్రీన్ చాలెంజ్ లాంటివి చేప‌ట్టి, అందరిలోనూ ప్ర‌త్యేకంగా నిలిచిన ఎంపీ.. తాజాగా క‌రోనా వేళ కూడా ఇంట్లోనే ఉండి అంద‌రికీ మంచి సందేవాన్నిచ్చారు. మరోవైపు క‌రోనా వైర‌స్ కారణంగా భారతదేశంలో 600 మందికిపైగా ప్రభావానికి లోనయ్యారు. ఇప్పటికే 11 మంది మహమ్మారికి బలయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించగా మంగ‌ళ‌వారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ప్రకటించారు.

Top