You are here
Home > Latest News > యాష్కీ.. నువ్వు కూడా నీతులు మాట్లాడుతున్నావా?

యాష్కీ.. నువ్వు కూడా నీతులు మాట్లాడుతున్నావా?

Spread the love

 

యాష్కీ.. నువ్వు కూడా నీతులు మాట్లాడుతున్నావా?

– ప్రజలు ఛీ కొడితే నిజామాబాద్ నుంచి పారిపోయిన నేత నోటి నుంచి నీతులు

– అర్హత లేని మాటలతో.. ఛీ కొట్టించుకున్న మధు యాష్కీ

– చేసిన మంచి పని లేదు కానీ.. కేసీఆర్ ను తిడ్తవా… అంటూ జనం ఆగ్రహం

మధు యాష్కీ అనే వ్యక్తి.. హద్దులు దాటుతున్నడు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ బాధ్యతలు అందిన సందర్భంగా.. తానేదో పార్టీకి ప్రచారం చేసి.. అధికారాన్ని తీసుకువస్తానని కలలు కంటున్నట్టుగా మాట్లాడుతున్నడు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో భాగంగా.. ప్రచార కమిటీ కొత్త బాధ్యుడిగా అవకాశం అందుకున్న ఆయన అడ్డగోలు వ్యాఖ్యలతో ఆదిలోనే పరువు పోగొట్టుకున్నడు. ఇలాంటి నేతతో భవిష్యత్తులో పార్టీకి కష్టమే అనిపించుకుంటున్నడు.

తెలంగాణ రాష్ట్రాన్ని చావు నోట్లో తలపెట్టి మరీ సాధించిన కేసీఆర్ ను ఉద్దేశించి.. అనరాని మాటలతో మధు యాష్కీ చేయరాని తప్పు చేసిండు. పార్టీ మారిన నేతలను ఉద్దేశించి.. ఆడామగా తేడా లేకుండా అసభ్యంగా మాట్లాడిండు. గతంలో.. వైఎస్ లాంటి తెలంగాణ వ్యతిరేకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కాంగ్రెస్ లోకి లాగిన సందర్భాన్ని మరిచి.. ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతున్నడు.

గతంలో.. హైదరాబాద్ కు పోవాలంటే వీసా అడుగుతారేమే అని వైఎస్ అన్నప్పుడు కనీసం కొట్లాడేందుకు కూడా ముందుకు రాని ఆయన… ఇప్పుడు తెలంగాణ సాధించి బంగారు తెలంగాణ సాధన దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నడు. బిడ్డా మధు యాష్కీ.. నువ్వేందో.. నీ చరిత్ర ఏందో.. ఫారిన్ లో సంపాదించిన డబ్బులు ఇక్కడ ఎట్ల ఖర్చు పెట్టినవో.. నిజామాబాద్ ప్రజలు తరిమి తంతే.. ఎట్ల బయటికొచ్చినవో అందరికీ తెలుసు.

హద్దులు దాటి మాట్లాడితే.. అడ్డగోలు విమర్శలు చేస్తే.. మర్యాద దక్కదు మధు యాష్కీ. నీలాగే గతంలో మాట్లాడిన ఎంతో మంది కాంగ్రెస్ అతిరథులు.. టీఆర్ఎస్ ధాటికి కాలగర్భంలో కలిసిపోయారు. మరెందరో కారెక్కి కేసీఆర్ నీడలో బతికాలని ఆరాటపడుతున్నరు. నీ గతి కూడా రేపు ఇంతే అని గుర్తుంచుకో. మైకు దొరికింది కదా అని మాట్లాడితె.. కత్తి దొరికింది కదా అని సమయం చూసి ప్రజలే నీ నాలిక కోస్తరు జాగ్రత్త.

కేసీఆర్ ను విమర్శించేందుకు కాదు కదా.. అసలు ఆయన పేరు ఎత్తేందుకే మధు యాష్కీకి అర్హత లేదని జనం అంటున్నరు. ఎంపీగా గెలిపించినప్పుడు గుర్తుంచుకునే పని ఒక్కటి కూడా చేయేలకపోయిన ఆయనకు.. అందరి సంక్షేమం కోసం కేసీఆర్ చేస్తున్న పరిపాలనను తప్పుబట్టే అర్హత లేదని తేల్చి చెబుతున్నరు.

Top