You are here
Home > Latest News > మనసున్న నేత.. అందుకే నేతన్నకు మళ్లీ చేయూత!

మనసున్న నేత.. అందుకే నేతన్నకు మళ్లీ చేయూత!

Spread the love

మనసున్న నేత.. అందుకే నేతన్నకు మళ్లీ చేయూత!

  • మంత్రి కేటీఆర్ దాతృత్వంపై ప్రశంసల జల్లు
  • మరోసారి జననేత అని నిరూపించుకున్న యువనేత
  • తండ్రి అడుగుజాడల్లో బడుగులకు అండగా నిలిచిన కేటీఆర్
  • నేతన్నలకు రూ.500, 15 రోజులకు సరిపడా సరుకులు అందజేత

కష్టాల్లో ఉన్న వారెవరైనా సరే. వారి కష్టం ఎలాంటిదైనా సరే. రామన్నా.. అన్న ఒక్క పిలుపు దూరంలో ఉంటే యువనేత, జననేత కేటీఆర్. హైటెక్ కల్చర్ వారికైనా.. సిరిసిల్ల చేనేతవారికైనా.. ఎవరికైనా సరే. నాయకుడిగా ఆయన స్పందించే తీరు ఎప్పుడూ ఆశ్చర్యకరంగానూ.. అవసరంలో ఉన్న వారికి ఆనందం పంచేదిగానూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి అదే రీతిన తన మానవత్వాన్ని, మంచి మనసును చాటుకున్నారు.. కేటీఆర్. తనను నమ్మిన సిరిసిల్ల నియోజకవర్గంలోని నేతన్నలకు అండగా నిలిచారు. శభాష్ అనిపించుకుంటున్నారు.

ఏకంగా 4 వేల 500 మంది నేతన్నలకు.. 500 రూపాయల చొప్పున నగదు.. అలాగే 15 రోజులకు సరిపడా నిత్యావసర సరకులను అందించిన ఘనత.. కేటీఆర్ ది. ఆయన చేసిన సూచన ప్రకారం.. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సినారె కళామందిరంలో నేతన్నకు చేయూత పేరుతో కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నేతలు నిర్వహించారు. ఆపదలో ఉన్నవారికి కొండంత అండను అందించారు. కేటీఆర్ అందించిన సందేశాన్ని నేతన్నలకు చేరవేశారు. ఈ సహాయాన్ని అందుకున్న వారి ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.

చేనేత కార్మికుల ఆత్మహత్యలకు చిరునామాగా దేశవ్యాప్త దృష్టిని కేంద్రీకరించిన సిరిసిల్ల ఎక్కడ.. పట్నంలో వచ్చినంత ఆదాయాన్ని అందిస్తున్న ఈనాటి సిరిసిల్ల ఎక్కడ? మున్సిపాలిటీకే పరిమితమై అరకొర వసతులతో కాలం వెళ్లదీసిన సిరిసిల్ల ఎక్కడ.. జిల్లా కేంద్రంగా అనూహ్య అభివృద్ధిని సాధిస్తున్న ఈనాటి సిరిసిల్ల ఎక్కడ? వేములవాడకు 12 కిలోమీటర్ల దూరం పోవాల్నంటేనే యాత్ర చేసినంత భారాన్ని కలిగించిన ఆనాటి సిరిసిల్ల ఎక్కడ.. నాలుగు రోడ్లతో పావుగంటలో సిరిసిల్ల నుంచి వేములవాడకు చేరుకునే ఈ నాటి రహదారులెక్కడ?

ఇవన్నీ కేటీఆర్ నాయకత్వంలో సిరిసిల్ల సాధించిన ఘనతలే. బడుగులు తమ జీవన స్థాయిని పెంచుకున్న తీరుకు ఇవన్నీ సూచికలే. ఇవన్నీ మరోసారి గుర్తుకు తెచ్చుకుంటూ.. కేటీఆర్ నాయక్వాన్ని నూటికి నూటొక్క మార్కులు వేస్తున్నరు.. సిరిసిల్ల ప్రజలు. సిరిసిల్ల రాత మార్చి.. కొత్త గీత గీసి.. తమ బతుకుల్లో వెలుగులు నింపిన్న రామన్నను గుండెల్ల పెట్టుకుని చూస్కుంటమంటున్నరు.. అక్కడి జనాలు.

Top