You are here
Home > Latest News > ఎందుకు పెంచాలి జీతాలు ?

ఎందుకు పెంచాలి జీతాలు ?

Spread the love

 

  • ఎందుకు పెంచాలి జీతాలు ?
  • ఉద్యోగులు ఏం పొడుస్తున్న‌రు ?
  • ప్ర‌భుత్వం క‌ఠినంగా ఉండాలి
  • వీళ్ల‌ను నెత్తిన ఎక్కించుకోకూడ‌దు
  • సామాన్యుడి మ‌నో గ‌తం ఇది…

 

ప‌నిలేని మంగ‌లోడు పిల్లి గ‌డ్డం గీసిన‌ట్టు.. నెత్తిన రూపాయి పెడితే ఆటానాకు కూడా అమ్ముడుపోని న‌ర్సిరెడ్డి అనే థ‌ర్డ్‌క్లాస్ లీడ‌ర్ ఉద్యోగుల జీతాలు పెంచాలని చేస్తున్న గోల‌ను అప్పోజిష‌నోళ్లు ఉద్య‌మం అని పిలుస్తున్నారు. ఇది పేద్ద డ్రామా. ఉత్త ఉద్య‌మం. రేవంత్ రెడ్డి, ర‌మ‌ణ వంటి ల‌త్కోర్‌గాళ్లు న‌డిపిస్తున్న క‌త ఇది. నిజం మాట్లాడుకోవాలంటే ఈ గ‌వ‌ర్న‌మెంటు… ఉద్యోగుల‌ను నెత్తిన ఎక్కించుకున్న‌ది. ఇప్పుడు ఈళ్లు గ‌వ‌ర్న‌మెంటు నెత్తిన ఎక్కి తైత‌క్క‌లాడుతున్న‌రు. గ‌వ‌ర్న‌మెంటుకే ధ‌మ్కీ ఇచ్చే రేంజ్‌కు పోయిండ్రు.

మీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పుండ్రి.. మీలో క‌నీసం ప‌ది శాతం మందైనా నిజాయ‌తీగా ప‌నిచేస్తున్న‌రా రా బై ? టయిమ్‌కు ఆఫీసుకు ఒస్తున్రా ? రారు.. స‌చ్చినా రారు. నూటికి 90 శాతం మంది ఉద్యోగుల‌కు లంచాల రోగం ఉంది. మీరు తింటున్న‌ది నెత్తుటి కూడు. జ‌నాన్ని దోచుకుంట‌న్న దొంగ‌లు కారా మీరు ? ఈ గ‌వ‌ర్న‌మెంటు ఒక్కో ఎంప్లాయికి క‌నీసం రూ.40 వేల జీతం ఇస్తుంది. రూ.రెండు ల‌క్ష‌ల దాకా జీతం తీసుకునే దొర‌లూ ఉన్న‌రు. ఇన్ని పైస‌ల‌తో రాజా లెక్క బ‌త‌కొచ్చు. ఇంత జీతం తీసుకొనేటోడు నెల‌కు ప‌ది వేలు కూడా ఆమ్దానీ లేని రైతును, కూలీని లంచం అడుగుతున్న‌డు. ఇంత కంటే ఘోరం ఎక్క‌డుంది ? జ‌నం ర‌క్తాన్ని జ‌ల‌గ‌ల్లా పీలుస్తున్రు.

రెవెన్యూ, పోలీసు, టీచ‌ర్లు, పంచాయ‌తీ రాజ్ ఉద్యోగులు అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్‌లా మారిపోయిన్రు. టీచ‌ర్ల క‌త అయినా శానా పెద్ద‌ది. చాలా మంది పంతుళ్లు అస‌లు బ‌డికే రారు. వ‌చ్చినా పాఠాలు చెప్ప‌రు. సంఘాలు, యూనియ‌న్లు, వాటి మీటింగులు, పార్ట్ టైం జాబ్‌లు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇలా స‌వాల‌క్ష ప‌నులు సార్ల‌కు. పాఠాలు చెప్ప‌రు కానీ ల‌క్ష‌ల్లో జీతాలు రావాలి. పీఆర్సీ ఒక్క నిమిషం కూడా లేటు కాకూడ‌దు. ప్ర‌మోష‌న్ వెంట‌నే రావాలి. లేక‌పోతే వెంట‌నే ఉద్య‌మం అంట‌రు. నిర‌స‌న అంట‌రు. రెవెన్యూ ఆఫీసుల ముంద‌ట జ‌నం ఆందోళ‌న చేయ‌ని రోజంటూ ఉండ‌దు. ఆ మ‌ధ్య ఒక రైతు ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి చంపిన ఘోరాన్ని ఎలా మ‌ర్చిపోగ‌లం ?

జ‌నం తిర‌గ‌బ‌డే ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింద‌ని ఉద్యోగులు ఆలోచించుకోవాలి. ఏసీబీకి చిక్కిన ఉద్యోగి.. అనే వార్త‌లు క‌నిపించ‌ని రోజు లేదు. వీళ్ల‌పై కంప్ల‌యింట్లు వేల సంఖ్య‌లో ఉన్నాయి. అవినీతి లేని ఒక్క పోలీసు స్టేష‌న్ ఉందా ఎక్క‌డైనా ? ఇలాంటి వాళ్ల‌ను గ‌వ‌ర్నమెంటు నెత్తిన ఎక్కించుకోవాలా ? వెంట‌నే పీఆర్సీ అమ‌లు చేయాలా ?  రూ.ల‌క్ష‌కుపైగా జీతం చేసుకునే వాళ్ల‌కు పీఆర్సీని అర్జంటుగా అమ‌లు చేయాల్నా ?  డ‌బ్బంతా వీళ్ల‌కే ఇస్తే జ‌నం ఏం గావాలె ? గ‌వ‌ర్న‌మెంటు పేదోళ్ల‌కు ఏం బెట్టాలె ? ఉన్నోడికే ఇంకా అంటే ఎలా ? కేసీఆర్ వెంట‌నే వీళ్ల తోక‌ల‌ను కోయాలే. లేక‌పోతే వీళ్లు మ‌రింత రెచ్చ‌పోత‌రు. న‌ర్సిరెడ్డి వంటి ఔలెగాళ్లు మ‌రింత మంది పుట్టుకొస్తరు.

Top