You are here
Home > Latest News > ఓడిపోయిన తర్వాత.. ఫిర్యాదులెందుకు??.

ఓడిపోయిన తర్వాత.. ఫిర్యాదులెందుకు??.

Spread the love

ఓడిపోయిన తర్వాత.. ఫిర్యాదులెందుకు??.

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నిజాయితీగా గెలిచింది రాంచందర్.
  • అక్రమాలకు పాల్పడితే.. నీకు లక్షఓట్లు ఏ విధంగా వస్తాయి.
  • టీఆర్ఎస్ ఆ విధంగా చేస్తే.. నీకు డిపాజిట్లు కూడా వచ్చేవి కాదు.
  • నీ బోడి ఫిర్యాదుల వల్ల ఒరిగేది ఏమీ ఉండదు.

బీజేపీ నాయకులు ఎన్ని ఎత్తులు వేసినా.. సిట్టింగ్ స్థానంలో ఓడామనే బాధ వాళ్లలో కనిపిస్తోంది. అందుకే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందని.. ఈసీకి కంప్లైంట్ చేసిండు.. రాంచందర్ రావు. ఓటమిని హుందాగా అంగీకరించకుండా.. కంప్లైంట్ లు, అక్రమాలు అంటూ సొల్లు కబుర్లు చెప్పడం ఎందుకు??. జనం మిమ్మల్ని ఓడించారు దట్సాల్.. అంతేకానీ.. మళ్లీ కంప్లైంట్ లు తొక్క తోటకూర ఎందుకు?. టీఆర్ఎస్ ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు. అలాంటిది ఏమైనా నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే.. చూపెట్టు. బీజేపీ నాయకులు ఎన్ని ఆరోపణలు.. అభాండాలు టీఆర్ఎస్ మీద వేసినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
ఫిర్యాదులు కాదు.. పొర్లు దండాలు పెట్టినా మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరు రాంచందర్. ఆరేళ్లుగా మీరు ఏమీ చెయ్యలేదనే జనం టీఆర్ఎస్ కు ఓట్లేశారు. యువత, ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు కదా?. మరి దాదాపు 2లక్షల ఓట్లు టీఆర్ఎస్ కు ఎలా పడ్డాయంటావ్. సిట్టింగ్ స్థానంలో నువ్వు చిత్తుగా ఎలా ఓడావ్ అంటావ్. ఓడిపోయినందుకు సిగ్గుపడకుండా.. ఇంకా కంప్లైంట్ లు.. అక్రమాలంటూ అనవసర రాద్దాంతం ఎందుకు?. మీరెన్ని కథలు పడ్డా.. మళ్లీ ఎన్నికలు రావు.. ఎమ్మెల్సీగా నువ్ గెలవవు. పనికిమాలిన విమర్శలు ఆపి.. ఎందుకు ఓట్లెయ్యలేదో.. తల పట్టుకుని ఆలోచించు.
టీఆర్ఎస్ మీద ఎన్ని కంప్లైంట్స్ చేసినా.. వృధానే. దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. బీజేపీ నాయకుల రెచ్చగొట్టే మాటలు విని ఎవ్వరూ మోస పోలే.. మీ కుల, మత రాజకీయాలకు ఓట్లు వేయలే. సిట్టింగ్ స్థానంలో ఓడినందుకు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని టీఆర్ఎస్ మీద లేని పోని విమర్శలు ఆపండి. జనంలో మీ పార్టీ బలం పెంచుకునే ఆలోచన చేయండి. ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకుంటే.. ఓట్లు రాలతాయి అనేది పొరపాటే.

Top