You are here
Home > Latest News > మోదీ సారూ.. ఏం చేశారని ఇన్ని అప్పులు చేశారు?

మోదీ సారూ.. ఏం చేశారని ఇన్ని అప్పులు చేశారు?

Spread the love

మోదీ సారూ.. ఏం చేశారని ఇన్ని అప్పులు చేశారు?

  • మోదీ హయాంలో 82 లక్షల కోట్లకు చేరిన దేశ అప్పులు
  • ఇది మరిచి తెలంగాణపై బురద చల్లే ప్రయత్నాలు
  • సంక్షేమం పేరుతో దేశాన్ని సర్వనాశనం చేసిన తీరు

ఇతర రాష్ట్రాలు.. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం చేస్తున్న అప్పులు, అభివృద్ధికి చేస్తున్న ఖర్చుపై.. బీజేజీ నేతలు.. రాజ్యసభ సాక్షిగా గగ్గోలుపెట్టారే… మరి స్వయానా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు, వృథా ఖర్చుల గురించి ఎవరు మాట్లాడతారు? ఐదేళ్లలో 50 శాతం అప్పులు పెంచేసిన తమకు.. 82 లక్షల కోట్లకు చేర్చిన మన భారాన్ని చేర్చిన తీరుకు ఎవరు సమాధానం చెబుతారు?

తెలంగాణలో చూస్తే.. మిషన్ కాకతీయ.. మిషన్ భగీరథ.. వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లు.. రైతు బంధు.. రైతు బీమా.. ఇప్పటికీ జాతీయ హోదా దక్కని కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ కిట్.. ఇలా రకరకాల పథకాలు జనం చెంతకు సంక్షేమాన్ని చేరుస్తున్నాయి. తెలంగాణను సశ్యశ్యామలం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, అధఇకారులు ప్రశంసించిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. సాక్షాత్తూ కేంద్రం కూడా ఎన్నోసార్లు ఈ పథకాలను ప్రస్తుతించిన విషయం కూడా దేశ ప్రజానీకానికి తెలుసు.

మరి కేంద్రం ఇంతగా ఎందుకు అప్పులు చేస్తోంది? గతంలో బీహార్ కు ప్రకటించిన లక్ష కోట్ల ప్యాకేజీ ఏమైనా అమలు చేసిందా? పాకిస్థాన్ తో సరిహద్దులో పోరాటానికి, సర్జికల్ స్ట్రైక్స్ కు ఏమైనా లక్షల కోట్లు ఖర్చు చేసిందా? రామ మందిరం నిర్మించేందుకు ఏమైనా ప్రజలకు తెలియకుండా వేల కోట్లు ఖర్చు చేసిందా? ఏం చేశారని ఇంతగా అప్పులు ఈ ఐదేళ్లు? వేల కోట్ల పన్నుల వసూళ్లు ఎటు పోతున్నాయి? ప్రజల నుంచి రక్తం పిండి వసూలు చేస్తున్న డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? అవినీతి లేని సామ్రాజ్యం అంటే ఇదేనా?

మోడీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రైతులను ఆదుకుంటున్నామనీ.. ప్రజలకు బ్యాంకు ఖాతాలు ఇస్తున్నామనీ.. ఇంకేదో చేస్తున్నామని గారడీ మాటలు చెప్పడం కాదు. తెలంగాణ ప్రభుత్వం చేసి చూపెడుతున్నట్టు మోడీ ప్రభుత్వం ఏం చేస్తున్నదన్నదీ చూపమనండి. అప్పుడుగానీ.. ఈ అప్పుల లెక్క తేలదు. జనంలో సందేహాలు తీరవు. ఒకవేళ.. బీజేపీ కానీ.. మోడీ ప్రభుత్వం కానీ తగిన సమాధానం ఇవ్వకుంటే.. కేంద్రం అవినీతిలో కూరుకుపోయింది విపక్షాలు చేస్తున్న ఆరోపణలను జనం కచ్చితంగా నమ్మాల్సివస్తుంది.

Top