You are here
Home > Telangana > మోడీని కేసీఆర్​ ఎందుకు కలవాలి ?

మోడీని కేసీఆర్​ ఎందుకు కలవాలి ?

Spread the love

 

మోడీని కేసీఆర్​ ఎందుకు కలవాలి ?

కలిసి ఆయనకు పాదాభివందం చేయాల్నా ?

బీజేపీ వేసే ఎంగిలి మెతుకులతో పార్టీని నడుపుతున్న కడప దొరసాని వైఎస్ షర్మిల పువ్వు పార్టీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నది. వాళ్ల ఆదేశాల మేరకు కేసీఆర్​ను తిడుతున్నది. తెలంగాణలో ఈమె పార్టీకి కుక్కలు కూడా పట్టించుకోవట్లేదు. అయినా దింపుడుగళ్లెం ఆశలను మాత్రం చంపుకోవడం లేదు. తాజాగా తన కురచబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. మోడీకి భయపడే కేసీఆర్​ ముచ్చింతల్​కు రాలేదంటూ సొల్లు వాగింది.

బీజేపీకి, తెరాసకు రహస్య దోస్తీ ఉందంటూ తన అమాయకత్వాన్ని బయటపెట్టుకుంది. ఇలాంటి మాటలు మాట్లాడుతోంది కాబట్టే ఈ కడపబిడ్డను తెలంగాణలో చీదరించుకుంటున్నారు. అసహ్యించుకుంటున్నారు. కేసీఆర్​, మోడీ మధ్య పచ్చగడ్డి వేస్తే మండుతోంది. ప్రధాని అయి ఉండి కూడా రాజ్యాంగ విలువలకు పాతర వేస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు గాలికి వదిలేశారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణకు నయాపైసా సాయం చేయడం లేదు.

మన రాష్ట్రం నుంచి రూ.60 వేల ఆదాయం ఢిల్లీకి వెళ్తే కనీసం రూ.20 వేల కోట్లు కూడా రావడం లేదు. ఇక కేసీఆర్​ ప్రభుత్వాన్ని ఎలా నడపాలి ? సంక్షేమ పథకాలను ఎలా అమలు చేయాలి ? కేసీఆర్​ లక్షల జాబ్స్ ఇవ్వాలి… అందరికీ ఇండ్లు ఇవ్వాలి.. మహిళలకు లోన్లు ఇవ్వాలి అంటూ రోజుకు ఒక డిమాండ్​ చేస్తరు. మరి కూడా కూడా తెలంగాణకు న్యాయంగా ఇవ్వాల్సిన డబ్బు పంపించాలని ఈ పొలిటికల్​ మాఫియా ఒక్కసారి కూడా మాట్లాడదు. మోడీ తెలంగాణకు విలన్​గా మారారు కాబట్టే కేసీఆర్​ ఆయన ముఖం కూడా చూసేందుకు ఇష్టపడలేదు.

బీజేపీని కూకటివేళ్లతో సహా పెకిలిస్తానని చాలెంజ్​ చేసిన వ్యక్తి మోడీ హైదరాబాద్ వస్తే మంగళహారతులు పడతారా ? ఎయిర్​పోర్టుకు వెళ్లి స్వాగతసత్కారాలు చేస్తారా ? కేసీఆర్​ వెళ్లకపోవడానికి జ్వరం కారణం కాదని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. మోడీ ముఖం చూడటం ఇష్టం లేకే వెళ్లలేదన్నది వందశాతం నిజం. ఒకవేళ వెళ్లినా ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉండేది. కేసీఆర్​ ఆవేశాన్ని ఆపుకోలేక మోడీతో వాదనకు దిగి ఉండేవారు. ఇదంతా ఇష్టం లేకే ఆయన ఒక రోజు ముందుగానే ముచ్చింతల్​ వెళ్లి సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు.

ఈ విషయాన్ని రాజకీయ చేసి ఏదో బావుకుందామని కడప రెడ్డమ్మ ప్లాన్లేస్తోంది. షర్మిలమ్మా.. నువ్వింకా చాలా ఎదగాలి. కేసీఆర్​ను విమర్శించే లెవెల్​ నీది కాదు. ఆయన రాజకీయాలను అర్థం చేసుకొనే తెలివి నీకు లేదు.

Top