You are here
Home > Uncategorized > మోడీ క్షమాపణ చెప్పాల్సిందే… మొదలైన తెరాస ఎంపీల పోరాటం

మోడీ క్షమాపణ చెప్పాల్సిందే… మొదలైన తెరాస ఎంపీల పోరాటం

Spread the love

 

మోడీ క్షమాపణ చెప్పాల్సిందే…

మొదలైన తెరాస ఎంపీల పోరాటం

 

ఖుల్లం ఖుల్లా.. నరేంద్ర మోడీ పక్కా తెలంగాణ వ్యతిరేకమని మొన్న రాజ్యసభలో మాట్లాడిన మాటలతో ప్రతి ఒక్కరికీ అర్థమైంది. ఇంతకాలం కేసీఆర్ చెప్పిన మాటలను నిజమైన రూడీ అయింది. నాలుగు కోట్ల మంది మనసులను గాయపరిచేలా మాట్లాడినందుకు ఆయన జాతికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే! బీజేపీని బొందపెడితేనే వీళ్ల అహంకారం తగ్గుతుంది. ప్రధానమంత్రి మోదీ దేశానికి అత్యున్నతమైన పార్లమెంట్‌తోపాటు అప్పటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌ను అవమానించారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మోడీ వ్యాఖ్యలున్నాయి. అందుకే తెరాస ఎంపీలు తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయ్యారు. అన్ని వేదికలపైనా గొంతు విప్పుతున్నారు. మోడీ ఎంతటి దుర్మార్గుడో తెలియజేయడానికి పార్లమెంటులో పోరాటం మొదలుపెట్టారు. ఆయనపై టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదంపై రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా ఫిబ్రవరి 8న రాజ్యసభలో చేసిన ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ మీద టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టారు.

రాజ్యసభ చైర్మన్ కు  నోటీసులు ఇచ్చారు. తెలంగాణను అవమానించారని ఆ నోటీసులో ఎంపీలు పేర్కొన్నారు. తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేశారని మాట్లాడడం రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుంది. పార్లమెంట్‌లో  పాస్ అయిన బిల్లును అవహేళన చేయడం సరికాదని అనడం తప్పని ప్రధానికి తెలియదని అనుకోలేం.

సెంటిమెంట్లు రెచ్చగొట్టేందుకే మోడీ అలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు కచ్చితంగా సభా నియమాలకు వ్యతిరేకం. సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయి.  టీఆర్‌ఎస్ ఎంపీలు రాజ్యసభలో ఇవాళ ఆందోళనకు దిగారు.  ఛైర్మన్ వెల్  వద్ద నిరసన తెలిపారు. ఇకనైనా మోడీ జాతికి క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటి తింగరి మాటలు మాట్లాడనని వాగ్దానం చేయాలి.

Top