You are here
Home > Latest News > నిరుద్యోగులపై మొసలి కన్నీళ్లు ఆపండి.

నిరుద్యోగులపై మొసలి కన్నీళ్లు ఆపండి.

Spread the love

నిరుద్యోగులపై మొసలి కన్నీళ్లు ఆపండి.

  1. నిరుద్యోగంపై కాంగ్రెస్ మాట్లాడితే…
  2. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటది శ్రవణ్.
  3. కాంగ్రెస్ వల్లనే కదా దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది.
  4. పదేళ్లు అధికారంలో ఉండి మీరేం చేశారు?. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు??.

కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగ యువత మీద మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. కానీ వాళ్లపై నిజంగా ప్రేమ అనేది లేదు. ఉద్యోగాలు ఇవ్వాలన్న సోయి ఉంటే.. పదేళ్లు అధికారంలో ఉండి లక్ష ఖాళీలను ఎందుకు పెడతారు. వాళ్లు అధికారంలో కాంట్రాక్ట్ జాబులు ఇవ్వొచ్చు. కేసీఆర్ మాత్రం ఇవ్వొద్దు. నేరుగా ఉద్యోగాలనే భర్తీ చేయాల్నా?. అయినా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత.. లక్షకు పైగా ఉద్యోగాల భర్తీని చేసి చూపెట్టింది. ఇవాళ ఏదైతే నిరుద్యోగ యువత ఉందో.. వాళ్ల ఓట్లతోనే మొన్న.. రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుంది.

 

మరి యువత ప్రభుత్వం చేస్తోంది కరెక్టేనని ఒప్పుకున్నట్లే కదా శ్రవణ్.
బిశ్వాల్ కమిటీ చెప్పినట్లు.. లక్షా 90వేల ఉద్యోగ ఖాళీల్లో.. లక్షకు పైగా ఉద్యోగాల్ని ఇప్పటికే టీఆర్ఎస్ సర్కార్ భర్తీ చేసింది. మరో 50వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఒకేసారి ఇచ్చేలా సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుని తీరుతుంది ప్రభుత్వం. మొన్ననే.. TSPSCకి కొత్త పాలకమండలిని నియమించడం జరిగింది. యూనివర్సిటీలకు వీసీలను అపాయింట్ చేయడం జరిగింది. ఉద్యోగ ఖాళీల వివరాలు ఇవ్వాలని ఇప్పటికే కలెక్టర్లను ఆదేశించింది. అన్ని వివరాలు సేకరించి.. ఎక్కడెక్కడ అత్యవసరం ఉందో.. వెంటనే రిక్రూట్ మెంట్ చేసుకోవాలని.. మొన్నటి సీఎం వరంగల్ పర్యటనలో కలెక్టర్లను ఆదేశించడం జరిగింది.

ఒకవైపు కరోనా, లాక్ డౌన్ కారణంగా నష్టపోతున్నా.. ప్రజా సంక్షేమానికి, పాలనకు ఎక్కడా లోటు రాకుండా చూస్తోంది ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా వడ్ల కొనుగోళ్లు కూడా జరుపుతోంది. యువతకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారానైనా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కష్టకాలంలో పనిచేసే వైద్య సిబ్బందికి రేపు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ లో ప్రాధాన్యత ఇస్తామని చెప్తోంది. పక్క రాష్ట్రాలతో పోలిస్తే.. కరోనా కట్టడిలోనూ, రాష్ట్ర ఆర్థిక వ్యవహారంలోనూ మనం మెరుగ్గా ఉన్నాం. అనవసర ఖర్చులకు పోకుండా.. అవసరమైన వాటికే నిధులు వినియోగిస్తూ ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తోంది సర్కార్. ముందు ఈ కరోనా విపత్తు నుంచి బయటపడితే… ఉద్యోగాల భర్తీ అనేది పెద్ద విషయం ఏం కాదు శ్రవణ్.

Top