You are here
Home > Uncategorized > నల్లబంగారంపై కార్పొరేట్ల కన్ను ధారాదత్తం చేసేందుకు మోడీ రెడీ

నల్లబంగారంపై కార్పొరేట్ల కన్ను ధారాదత్తం చేసేందుకు మోడీ రెడీ

Spread the love

 

ప్రమాదపుటంచున సింగరేణి

నల్లబంగారంపై కార్పొరేట్ల కన్ను

ధారాదత్తం చేసేందుకు మోడీ రెడీ

పోరాటానికి గులాబీ శ్రేణులు సై

 

తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిని దెబ్బతీసేందుకు పువ్వుపార్టీ కుట్రలు మొదలుపెట్టింది. రాష్ట్రానికి గుండెకాయ వంటి కంపెనీని కార్పొరేట్ల చేతుల్లో పెట్టేందుకు ప్లాన్లు రెడీ చేస్తోంది. మన కార్మికుల కడుపు కొట్టేందుకు సిద్ధమయింది. దీంతో తెరాస శ్రేణులు అప్రమత్తమయ్యాయి.

సింగరేణిని కాపాడుకునేందుకు కార్మికులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని తెరాస ప్రకటించింది. సింగరేణి గనులను వేలం వేస్తే బీజేపీ దెబ్బతినడం ఖాయమని, సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుందని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లెటర్ కూడా​ రాశారు.

లాభాల్లో ఉన్న సింగరేణిని ప్రైవేట్​పరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నది. జేబీఆర్ఓసీ – 3, కేకే –6, శ్రావణ్పల్లి, ఓసీ, కోయగూడెం బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించకుండా, వేలానికి పెట్టింది. ఇవన్నీ అదానీ చేతికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంస్థ బలోపేతానికి కొత్త బ్లాకులు కేటాయించాల్సింది పోయి, సింగరేణి పరిధిలో ఉన్న వాటిని వేయడం దుర్మార్గం.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి లాభాల్లో దూసుకుపోతున్నది. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రంకు దేశంలోనే అత్యుత్తమ పీఎల్ఎఫ్ ఉంది. కార్మికులకు లాభాల్లో 29 శాతం వాటా ఇస్తున్న ఒకే ఒక సంస్థ సింగరేణి .

గుజరాత్ ప్రభుత్వం అడిగితే లిగ్నైట్ గనులను వేలం వేయకుండా ఆ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వం కోరినా బొగ్గు గనులు వేలం విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నదన్న కేటీఆర్​ విమర్శలతో కేంద్రం బుద్ధి తెచ్చుకోవాలి.  సింగరేణిని   ప్రైవేటీకరిస్తే వారసత్వ ఉద్యోగాలు కార్మిక కుటుంబాలకు దొరికే అవకాశం ఉండదు. భవిష్యత్తులో ఈ సంస్థ కనుమరుగైపోతుంది. బొగ్గు బ్లాకుల వేలంపై వెనక్కి తగ్గకుంటే కార్మికులు ఉక్కు పిడికిలి బిగించి బీజేపీని వెంటపడి తరమడం ఖాయం.

ఇప్పటికే ఎయిర్​ ఇండియాను అమ్మేశారు. ఎల్​ఐసీ అమ్మకానికి రెడీ అయింది. ఇప్పుడు సింగరేణి వంతువస్తోంది. ఈ దుర్మార్గాలను ఆపకుంటే లక్షల మంది కార్మికుల భవిష్యత్​ ప్రమాదంలో పడుతుంది.

Top