You are here
Home > Latest News > ప్రస్తుతం పాలన పడకేసింది దేశంలోనే

ప్రస్తుతం పాలన పడకేసింది దేశంలోనే

Spread the love
  • కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదు ఇంద్రసేనారెడ్డి
  • ప్రస్తుతం పాలన పడకేసింది దేశంలోనే
  • మొన్న బడ్జెట్ లోనే తెలిసిపోయింది మోదీ పనితీరు
  • మీరు తెలంగాణ బీజేపీ నేతలుగా ఉండి సిగ్గుపడాలి
  • కనీసం కాళేశ్వరానికి జాతీయ హోదాను కూడా తీసుకురాలేకపోయారు

అయ్యా.. ఇంద్రసేనారెడ్డి… రాష్ట్రంలో పాలన పడకేసిందా? మరి.. దేశంలో ఉరుకుతోందా? కేంద్రంలోనే పాలన పడకేసింది. మోదీ దేశాన్ని పాలించలేక చేతులెత్తేశారు. మొన్న బడ్జెట్ లోనే తెలిసిపోయింది మోదీ పనితీరు. కనీసం బడ్జెట్ లో దేనికి ఎంత కేటాయింపులు చేయాలో కూడా తెలియలేదు. బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం బిగ్ ఫెయిల్యూర్. బడ్జెట్ లో తెలంగాణకు చేసిందేంటి. అసలు కేంద్రంలో పాలన ఉందా? నిజంగా కేంద్రంలో పాలన ఉంటే ఇలాగేనా పాలించేది.

ముందు మీరు తెలంగాణ బీజేపీ నేతలుగా ఉండి సిగ్గుపడండి. మీరు బీజేపీ నేతలు అయి ఉండి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా తీసుకురాలేకపోయారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. మీవల్ల ఏంటి తెలంగాణకు లాభం. మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉందా? ఉంటే.. ఇలాగే చేస్తారా? ఇదేనా మీకు తెలంగాణపై ఉన్న ప్రేమ. మీకు తెలంగాణపై ఉన్నది కేవలం కపట ప్రేమ. మొసలి కన్నీరు కారుస్తున్నారు మీరు. మీ గురించి తెలంగాణ ప్రజలకు తెలియదా?

రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూడటం కాదు ఇంద్రసేనారెడ్డి.. బీజేపీని తొక్కేస్తున్నారు. తెలంగాణలోని సమస్యలపై మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. కేంద్రానికి తెలంగాణ అంటే పట్టదా? ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరానికి ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేకపోయింది మీ పార్టీ. పోనీ.. ప్రాజెక్టు నిర్మాణానికి ఏమన్నా ఇచ్చారా? నయా పైసా ఇవ్వలేదు. కానీ.. మీకు తెలంగాణలో అధికారం కావాలి. ఏం చేస్తారు.. అధికారంలోకి వస్తే. కేంద్రంలో అధికారంలోకి వచ్చి మీరు చేసిందేమీ లేదు. ఇక.. తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏం సాధిస్తారు.

Top