You are here
Home > Latest News > మోదీ గారూ.. ముందు చూపు అంటే ఇదేనా?

మోదీ గారూ.. ముందు చూపు అంటే ఇదేనా?

Spread the love

 

మోదీ గారూ.. ముందు చూపు అంటే ఇదేనా?
– నిధులూ లేవు.. నిబంధనలూ సరిగా లేవు
– అత్యున్నత సలహాలు ఇచ్చినా ఏమాత్రం పట్టింపు లేదు
– ఆర్థిక సంక్షోభ నివారణలో మరీ ఇంత అలసత్వమా?

ప్రధాని మోదీ గురించి ఇన్నాళ్లూ ఆహా ఓహో అని చాలా మంది అంటుంటే.. మనం కూడా తానా తందానా అంటూ వచ్చాం. కానీ.. ఇప్పుడిప్పుడే అసలు రంగు బయటపడుతున్నది. ఆయనది ముందు చూపు కాదు.. మందగించిన చూపు అన్న వాస్తవం ప్రజలకు అర్థమవుతున్నది. కొవిడ్ 19 నియంత్రణ దిశగా అమలు చేస్తున్న ఆంక్షల తీరు.. సడలింపులు ఇస్తున్న వైఖరి చూస్తుంటే.. ఆయన దేశాన్ని ఎటు తీసుకుపోతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఆర్థిక రంగానికి సంబంధించి కేంద్రం తీసుకుంటున్న చర్యలు.. తీవ్ర విమర్శలపాలవుతన్నాయి. మొదట అమలు చేసిన 21 రోజుల లాక్ డౌన్ కారణంగానే 8 లక్షల కోట్ల రూపాయలను దేశం నష్టపోయిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. ప్రధానిగా మోదీ ఏం చేయాలి? ఎలాంటి ఉన్నతమైన చర్యలు తీసుకోవాలి? దేశానికి ఆదర్శంగా నిలిచే పాలన అందించాల్సిన ప్రధాని.. ఆ దిశగా ఏం చేస్తున్నారన్నది.. తీవ్ర అసంతృప్తికి కారణం అవుతోంది.

ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా 90 శాతం ప్రజల ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇలాంటి పరిస్థితిని నివారించేందుకే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కీలక ప్రతిపాదనలు చేశారు. కేంద్రం తలుచుకుటే సెకన్ల వ్యవధిలో ఆమోద ముద్ర వేయగలిగే అత్యున్నత ప్రతిపాదనలు చేశారు. క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానంలో డబ్బులు ప్రజలకు పంపించాలని సూచించారు. ఇదే అమలైతే దేశ జీడీపీలో 5 శాతం సొమ్ము.. 10 లక్షల కోట్ల మేర జనానికి అందుబాటులోకి వచ్చేది. హెలికాఫ్టర్ మనీగా జనాలకు ఆ సొమ్మును పంచితే.. ప్రజల కొనుగోలు శక్తి పెరిగి.. ఆర్థిక వ్యవస్థ సమతుల్యం అయ్యేంది. కష్ట కాలంలో దేశానికి ఈ విధానం అండగా నిలిచేది.

కేసీఆర్ ప్రతిపాదించిన ఈ విషయాలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బలపరిచారు. అమలు చేయాలని ప్రధానిని కూడా కోరారు. కానీ.. ఎప్పటిలాగే ప్రధాని ఈ విషయాలను పట్టించుకోలేదు. కేవలం నామమాత్ర ప్యాకేజీని ప్రకటించి జనాన్ని, కొవిడ్ కారణంగా ఇబ్బంది పడుతున్న అన్ని వర్గాలను ఉసూరుమనిపించారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని.. ఆయన ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. లేదంటే.. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడమే కాదు.. ప్రజల జీవన ప్రమాణాలు కూడా పడిపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి.

కేసీఆర్ చెప్పిన సూచనలను పాటించడం నామోషీగా ఫీలయితే అది దేశానికి కష్టమన్న వాస్తవాన్ని ప్రధాని గుర్తించాలి. వాటిని అమలు చేస్తే.. కేంద్రానికి పలుకుబడి పెరిగి ప్రజాబలం కూడా మెండుగా ఉంటుందన్న నిజాన్ని కూడా అర్థం చేసుకోవాలి. లేదంటే.. దేశానికే కాదు.. కేంద్రంలో ఉన్న అధికార బీజేపీకి కూడా అంతకంటే ఎక్కువే నష్టం మిగలడం ఖాయం.
Top