
చింతపండుపై చర్యలు తీసుకోకుంటే..
ఇలాంటివి మళ్లీ జరుగుతాయి…
పోలీసులు రెస్పాండ్ కావాలె…
బీజేపీ వేసే రక్తపు మెతుకులతో బతికే నీచులకు నైతిక విలువలు, మర్యాద, మన్నన గురించి ఏం తెలుస్తాయి ? వ్యక్తిత్వాన్ని కించపర్చుతూ శునకానందం పొందే మనుషులు జర్నలిస్టులూ కారు.. లీడర్లూ కారు.. సైకోలు అవుతారు. ఇలాంటి వ్యక్తులకు సంఘబహిష్కరణ శిక్ష విధించడం ఒక్కటే మార్గం. చింతపండు నవీన్ ఎలియాస్ తీన్మార్ మల్లన్న మనుషులతో కలసి జీవించాల్సి వ్యక్తి కాదు. ఇతడు నూటికి నూరుశాతం ఉన్మాది.
‘అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా..? హిమాన్షు శరీరంలోనా..?’ అంటూ పోల్ నిర్వహించిప్పుడే ఈ విషయం అర్థమైంది. రాజకీయాలతో ఎటువంటి సంబంధమూ లేని ఒక పసివాణ్ని మనసును గాయపర్చడం వందశాతం తప్పు. మంత్రి కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం అతడి శరీరాకృతిని అవమానించడం సంస్కారమేనా..? ఇలాగే మోదీ, అమిత్ షా కుటుంబాలను లాగితే ఊరుకుంటారా? అన్న ప్రశ్నకు ఎవరు జవాబు చెబుతారు ? బాడీ షేమింగ్ చేస్తూ ట్వీట్ చేయడం దుస్సాహసం. పిల్లల్ని రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గం. దీని వెనుక బీజేపీ కుట్ర ఉంది. ఇదే బీజేపీ సంస్కృతి కూడా. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తన పద్దతి మార్చుకునే అవకాశం లేదు.
ఇతనికి మరోసారి చిప్పకూడు తినిపిస్తేనే దారికివస్తాడు. తెల్లారిలేస్తే కేటీఆర్ కుటుంబంపై పడి ఏడ్వడం ఇతనికి అలవాటుగా మారింది. వాళ్లు వందల కోట్ల ఆస్తులు సంపాదించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. బీజేపీకి చీము నెత్తురు ఉంటే ఆధారాలు చూపించాలి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై గతంలో అనేక సార్లు తెరాస కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అందుకే చింతపండు వంటి వాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది ? పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ కేటీఆర్‌పై దుర్భాషలాడిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటేనే ఇలాంటి తప్పులు మరోసారి జరగవు.