You are here
Home > Latest News > కేసీఆర్ సారథ్యంలోనే కొత్త ఫ్రంట్ సాధ్యం

కేసీఆర్ సారథ్యంలోనే కొత్త ఫ్రంట్ సాధ్యం

Spread the love

దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు మసకబారుతున్న తరుణంలో.. ఇతర పార్టీలకు టీఆర్ఎస్ పార్టీ ఓ చుక్కానిలా మారుతోంది. మాయా పాచికలు వేస్తూ.. జనాన్ని బుట్టలోకి దించుతూ.. 21 రాష్ట్రాల్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుపోయిన ఎన్డీయే పక్షాలు.. తెలంగాణలో మాత్రం ఆ ప్రభావాన్ని కలిగించలేకపోతున్నాయి. ఉన్న బలాన్ని కూడా పోగొట్టుకుంటూ.. అసలు తెలంగాణలో తమ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేసుకుంటున్నాయి.

కానీ.. ఉత్తరప్రదేశ్ లో చూస్తే సమాజ్ వాదీ పార్టీని నట్టేట ముంచారు. బీహార్ లో నితీశ్ కుమార్ ను నయానో భయానో దారికి తెచ్చుకున్నారు. గుజరాత్ లో ఓటమి అంచుల్లోనూ జనాన్ని మాయ చేసి అధికారాన్ని కాపాడుకున్నారు. మధ్యప్రదేశ్ లో వరుస హత్యల వ్యాపమ్ స్కామ్ జరిగినా కూడా.. అసాధ్యమైన రీతిలో అధికారాన్ని అందిపుచ్చుకున్నారు. తమిళనాడులో రకరకాల ప్రయోగాలు చేసి రాజకీయాలు భ్రష్టుపట్టించారు. ఇలా.. రకరకాల జిమ్మిక్కులు చేస్తున్న బీజేపీకి.. తెలంగాణ మాత్రం చాలా కాలంగా అందని ద్రాక్షగానే మారుతోంది.

అందుకే.. ఇప్పుడు దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీగా.. తెలంగాణ సాధించిన వైనంపై చర్చించుకుంటున్నాయి. కేంద్రానికి విధాన పరంగా మద్దతు ఇస్తూనే.. రాజకీయంగా పోరాడుతున్న విశిష్ట రాజకీయ వైశిష్ట్యాన్ని కీర్తిస్తున్నాయి. ఇలాంటి చర్యలను మార్గదర్శకంగా భావిస్తూ.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కదులుతున్నాయి. బీజేపీని దేశ వ్యాప్తంగా ఎదుర్కోగలిగిన పార్టీ ఏదైనా ఉందీ అంటే.. అది టీఆర్ఎస్ మాత్రమే అని నమ్ముతున్నాయి.

ఆ దిశగా.. ఇప్పుడు కేసీఆర్ చేసిన ప్రకటన కూడా.. ఇతర ప్రాంతీయ పార్టీల్లో జోష్ నింపుతోంది. ఎలాగైనా.. కొత్త ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని.. అది తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావుతోనే సాధ్యమని విశ్వాసం వ్యక్తమవుతోంది.

Top