You are here
Home > Latest News > పింఛన్ దారులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్త

పింఛన్ దారులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్త

Spread the love
  • సీఎం కేసీఆర్ మాటిస్తే ఆరు నూరైనా దాన్ని నిలబెట్టుకుంటారనడానికి పింఛన్ల పెంపే ఉదాహరణ
  • పింఛన్ కు అర్హత ఇఫ్పుడు 65 కాదు.. 57 ఏళ్లే
  • బీడీ కార్మికుల పింఛన్ కు ఉన్న కటాఫ్ కూడా తొలగింపు
  • పింఛన్ దారులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్త

నేను పెద్ద కొడుకుగా మీ కుటుంబానికి అండగా ఉంట.. అని ఇప్పుడు కాదు.. టీఆర్ఎస్ పార్టీని పెట్టినప్పటినుంచి సీఎం కేసీఆర్ తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ఇచ్చిన భరోసా అది. ఆ భరోసాను ఎన్నడూ సీఎం కేసీఆర్ తప్పలేదు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా తీర్చుతున్నారు.

వృద్ధులకు సాయంగా ఉంటానన్నారు. పింఛన్లను పెంచారు. పింఛన్ల అర్హతను కూడా తగ్గించారు. 57 ఏళ్లు నిండితే చాలు పింఛన్ కూడా వచ్చేస్తోంది. బీడీ కార్మికులకు పింఛన్ కటాఫ్ ను కూడా తగ్గిస్తూ సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఇలా.. దేశంలోనే ఏ రాష్ట్రమూ ప్రవేశపెట్టని విధంగా ఎన్నో కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేపడుతున్నారు. తెలంగాణలోని ప్రతి కుటుంబానికి సీఎం కేసీఆర్ ఆసరాగా ఉంటున్నారు అని చెప్పడానికి ఈ పథకాలే నిదర్శనం. ప్రస్తుతం ఉన్న పింఛన్లను రెట్టింపు చేస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. పెరిగిన పింఛన్లు కూడా జూన్ నుంచే వర్తిస్తాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాదు.. ఇవ్వని హామీలను కూడా నెరవేర్చుతున్న ఘనత సీఎం కేసీఆర్ ది. సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం.. తెలంగాణ ప్రజల బాగు కోసం ఇంతలా పాటుపడుతుండటం నిజంగా తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఆయన జీవితాన్ని తెలంగాణ ప్రజలకే అంకితం ఇచ్చారు అనడానికి ఇంత కన్నా ఉదాహరణలు కావాలా?

ఏ రాష్ట్రం కూడా ఇంత భారీ మొత్తంలో పింఛన్లను అందించదు. బీడీ కార్మికుల పింఛన్ కు కూడా కటాఫ్ తగ్గించి… వాళ్లందరూ సీఎం కేసీఆర్ కు రుణపడేలా చేశారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరు 57 నిండగానే నెలనెల ప్రభుత్వం నుంచి పింఛన్ పొందుతున్నారు. తమ కొడుకులు, కూతుళ్లు పట్టించుకోకున్నా… పెద్ద దిక్కులా.. పెద్ద కొడుకులా సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. ఇంతకన్నా.. తెలంగాణ ప్రజలకు ఇంకేం కావాలి.

Top