You are here
Home > Uncategorized > మ‌తం పేరుతో మ‌నుషుల‌ను విడ‌దీస్తారా ?

మ‌తం పేరుతో మ‌నుషుల‌ను విడ‌దీస్తారా ?

Spread the love
  • మ‌తం పేరుతో మ‌నుషుల‌ను విడ‌దీస్తారా ?
  • ఒక మ‌తంపై వివ‌క్ష చూప‌డం న్యాయ‌మేనా ?
  • ఇలాంటి విధానాల‌ను స‌మ‌ర్థించాలా ?

సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్(సీఏఏ), నేషనల్​పాపులేషన్​ రిజిస్టర్(ఎన్​పీఆర్) లను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఒక్క కారణమన్నా చెప్పాలంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్షాలను ఎంపీ బండి సంజయ్ నిలదీశాడు. ఈ వ్యతిరేక ఆందోళనలన్నీ దేశద్రోహుల కుట్రేనని ఆయన ఆరోపించాడు. సంజ‌య్‌.. సీఏఏ, ఎన్‌పీఆర్ రెండూ ముస్లింల‌ను ల‌క్ష్యంగా చేసుకొనే అమ‌లు చేస్తున్న‌వి కాద‌ని గుండె మీద చెయ్యేసి చెప్పు చూద్దాం. వీటి వెనుక మీ ల‌క్ష్యం సుస్ప‌ష్టం. ఇండియాను హిందూరాజ్యంగా మార్చాలి. ముస్లింల‌ను ఊచ‌కోత కోయాలి. వాళ్ల‌ను దేశం నుంచి వెళ్లగొట్టాలి. సెక్యులర్ దేశాన్ని మతం పేరుతో విడదీయాలనుకుంటున్నారు. ఎన్సార్సీ, ఎన్​పీఆర్​నాణేనికి రెండు వైపులు. మతం పేరుతో దేశాన్ని మార్చే చట్టాలు చేయడం తప్పు. అందుకే సిటిజన్ అమెండ్ మెంట్​యాక్ట్ ను పార్లమెంటులో వ్యతిరేకించామ‌ని తెరాస స‌హా విప‌క్షాలు ప్ర‌క‌టించాయి.

అది దేశంలోని ముస్లింలకే కాదు, హిందువులకు కూడా నష్టం కలిగించే బిల్లు.  2010 లో తెచ్చిన ఎన్‍పీఆర్, 2020 వచ్చే ఎన్‍పీఆర్ లో చాలా మార్పులున్నాయి. వాటిని కప్పిపుచ్చి కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేస్తోంది. అస్సాంలో ఎన్నార్సీ చట్టం ద్వారా 19 లక్షల పేర్లు రాలేదు. ముస్లిం పేర్లున్న వారికి అస్సాం  సిటిజన్‍షిప్‍లో పేర్లు గల్లంతు చేశారు. కేవలం మోదీ నోటి మాటల్లోనే సబ్‍కా సాత్ సబ్‍కా వికాస్ ఉంది. ఆచరణలో, అమల్లో లేదు. ఎన్సార్సీ, ఎన్‍పీఆర్ లో ఉన్న నిబంధనలు ఆమోదయోగ్యంగా లేవు. వాటి ద్వారా సేకరించే వివరాల కారణంగా మనం ఈ దేశవాసులమే అని రుజువు చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. డౌట్‍ఫుల్ సిటిజన్‍ కింద పడేసి నానా తిప్పలు పెట్టే యాక్ట్ ను ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకించాలి.

కేంద్రం మొదట ఎన్‌పిఆర్ చేపట్టి, తరువాత ఎన్‌ఆర్‌సిని పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) కింద సర్వే నిర్వహించినప్పుడు వివరాలు ఇవ్వడంలో విఫలమైన వారిని దేశంలోని నిర్బంధ కేంద్రాలకు పంపిస్తారు. పత్రాలను సమర్పించడంలో విఫలమైన వ్యక్తులు బస చేయడానికి కేంద్రం ఇప్పటికే నిర్బంధ కేంద్రాలను నిర్మిస్తోంది. అస్సాంలో ఇప్పటికే ఒక పెద్ద నిర్బంధ కేంద్రం నిర్మాణంలో ఉంది. ఈ విష‌యం బండి సంజ‌య్‌కు గుర్తు లేక‌పోవ‌చ్చు.

Top