
- తనకు తెలియదు.. చెబితే వినడు
- బీజేపీకి పంటికింద రాయిలా మారిన ఈటల
- తన దారి తనదే.. పార్టీ రూల్స్ జాన్తా నై..
ఈటల చెత్త పనులను భరించలేకే తెరాస తన్నితరివేసింది. ఆయన అక్రమాలు భరించలేకే పార్టీ నుంచి తీసేసింది. బీజేపీకి ఎవరూ దిక్కులేక ఈటలను మహాప్రసాదంలా స్వీకరించింది. బీజేపీ అనే గంగలో మునగ్గానే కోళ్లఫారం సర్వపాపాలూ ప్రక్షాళన అయ్యాయి. ఇప్పుడు కడిగిన ముత్యం అయిపోయాడు. ఈ షో ఇంతటితో అయిపోలేదు. కోళ్లఫారం ఏకులా వచ్చి మేకు అయ్యాడు. బీజేపీ పార్టీ తరఫున నెగ్గారనేమాటే కానీ.. ఆయన సొంత అజెండాతో సాగుతున్నాడు.
బీజేపీ బలం కన్నా తన బలంతోనే తను ఎమ్మెల్యేగా నెగ్గినట్టుగా ఆయన ఫీల్ అవుతున్నాడు. తను లేకుంటే బీజేపీనే లేదన్నట్టు మాట్లాడుతుండటంతో సంజయ్, కిషన్, అర్వింద్, వివేక్‌కు ఏం చేయాలో తెలియడం లేదు. అయితే సొంతంగా లేదంటే సొంత కులాన్ని ముందేసుకుని ఈటల రాజేందర్ సాగుతున్నాడు. ఈయన ఎవ్వారం ఢిల్లీ పెద్దలకు కూడా నచ్చడం లేదు. పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ పై పోటీకి సై అనే ప్రకటన రాష్ట్ర నాయకత్వానికి నచ్చలేదు. మిగతా వాళ్లంతా హౌలెగాళ్లా ? అని మండిపడుతున్నారు.
బీజేపీ ముఖ్య నేతలు అందరికీతోనూ కోళ్లఫారంకు లొల్లిలు ఉన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో అయినా, టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో అయినా తనకు మంచి సంబంధాలే ఉన్నాయని ఈటలపైకి చెబుతాడు కానీ లోపల మాత్రం పరిస్థితి వేరే ఉంది. పూటకో పార్టీ మార్చేవాడిని తెచ్చుకొని తప్పు చేశామని బీజేపీ ఇప్పుడు బాధపడుతోంది. ఉప ఎన్నికల్లో మాత్రమే ఈటల బీజేపీ తరఫున పోటీ చేశారని, త్వరలో కాంగ్రెస్ వైపు సాగే అవకాశం ఉందని ఈటల సన్నిహితులే చెబుతున్నారు.