You are here
Home > Uncategorized > దండం పెట్టిన వినని వాళ్ళకి దండం పట్టుడే కరెక్ట్ అంటున్న మేధావులు. 

దండం పెట్టిన వినని వాళ్ళకి దండం పట్టుడే కరెక్ట్ అంటున్న మేధావులు. 

Spread the love

 

  • కరోనాని తెలంగాణ నుండి వెళ్లగొట్టడానికి ఉక్కు సంకల్పంతో నిక్కచ్చిగా వ్యవహరించనున్న తెలంగాణ ప్రభుత్వం. 
  • దండం పెట్టిన వినని వాళ్ళకి దండం పట్టుడే కరెక్ట్ అంటున్న మేధావులు. 
  • కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత, అవసరమైతే ఆర్మీని కూడా రంగంలోకి దిగనున్న ప్రభుత్వం. 
కరోనా మహమ్మారిని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టడం ధ్యేయంగా ఉక్కు సంకల్పంతో గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు నిర్ణయం తీసుకున్నారు.మంత్రులు అధికారులు మరియు మేధావులతో ఏకంగా ఐదు గంటల పాటు మాట్లాడి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు.ఎంత చెప్పినా కొందరు మూర్ఖులు,సమాజంలో కలుపు మొక్కల్లా వ్యవహరిస్తున్న వారిని తగిన రీతీలో బుద్ది చెప్పాలని నిర్ణయించారు. అందులో భాగంగా కర్ఫ్యూని విధించడం, కనిపిస్తే కాల్చివేత చేయడం, అవసరమైతే ఆర్మీ ని రంగంలోకి దిగడం లాంటివి చేసి ఎలాగైనా పరిస్థితిని అదుపులోకి పెట్టాలని నిర్ణయించుకున్నారు.
సమాజ హితం కోసం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ సైతం దండం పెట్టి బతిమిలాడినా కూడా కొంతమంది ఆకతాయిలు చిల్లర వేషాలు వేస్తున్నారు. రోడ్ మీదకి వచ్చి బజారు రౌడీలా ప్రవర్తిస్తున్న సిగ్గు లేని సన్నాసులు వాళ్ళ ప్రాణాలతో పాటు తోటి వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి అన్నా ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారు.ఇటువంటి సంఘవిద్రోహ శక్తుల ని ఉక్కుపాదంతో అనచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే విదేశాల నుంచి వచ్చి హోమ్ క్వారంటాయిన్ పాటించని వ్యక్తుల పాస్పోర్ట్లను సీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. లాక్ డౌన్ తరుణంలో ఎవరైనా ధరలు పెంచినట్టు గాని తెలిస్తే వెంటనే వాళ్ళ లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంత పకడ్బందీగా వ్యవహరించడం తోనే తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా కరోనా మాయమవుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Top