You are here
Home > Uncategorized > రాష్ట్రపతి పాలన ఎందుకు పొన్నాల.

రాష్ట్రపతి పాలన ఎందుకు పొన్నాల.

Spread the love

 

  • రాష్ట్రపతి పాలన ఎందుకు పొన్నాల.
  • తెలంగాణ ప్రశాంతంగా ఉంది.. ఏ గొడవలు లేవు.
  • కానీ ప్రెసిడెంట్ రూల్ కావాలంటున్నావ్.
  • అసలు అది నోరా.. మూసి మోరా?.
  • సెక్రటేరియేట్ కు రాష్ట్రపతి పాలనకు సంబంధం ఉందా??.

పొన్నాల లక్ష్మయ్యకు పిచ్చి బాగా ముదిరినట్లుంది. సెక్రటేరియేట్ కూలగొడితే.. రాష్ట్రపతి పాలన పెట్టాలని అంటుండు. అసలు బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా?. ఏ వాగుతున్నవో నీకైనా అర్థం అవుతుందా?. ప్రెసిడెంట్ రూల్ అనేది.. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు.. పరిపాలన సరిగ్గా జరగనప్పుడు.. ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేనప్పుడు విధిస్తారు. కానీ.. ఇటువంటివేమీ రాష్ట్రంలో లేవు. శాంతి భద్రతల సమస్య  అస్సలు లేదు.. రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంది. పరిపాలన అంతా బాగా నడుస్తోంది. ప్రభుత్వం నుంచి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందుతున్నాయి.

కానీ ఈ టైంలో రాష్ట్రపతి పాలన పెట్టాలనే బుడ్డరఖాన్ డిమాండ్స్ ఎందుకు?. సెక్రటేరియేట్ కూల్చివేతకు, రాష్ట్రపతి పాలనకు ఏమైనా సంబంధం ఉందా??. ప్రజలు నవ్వుకుంటారన్న సిగ్గు, ఎగ్గు లేకుండా స్టేట్మెంట్స్ ఇవ్వడమేనా??. సెక్రటేరియేట్ కొత్తది కడతామని గత ఎన్నికల ముందు నుంచి చెప్తూనే ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చింది. ప్రజలు నమ్మారు, విశ్వసించారు.. గో హెడ్ అంటూ.. గతం కంటే ఎక్కువ సీట్లు ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. ఒకవేళ కొత్త సెక్రటేరియేట్ ను ప్రజలు వ్యతిరేకిస్తూ.. టీఆర్ఎస్ నిర్ణయం తప్పే అయితే.. ఎన్నికల్లో సీట్లు తక్కువ రావాలి కదా?.

2014 నుంచి ఏ ఎన్నిక వచ్చినా.. తిరుగులేని మెజార్టీ టీఆర్ఎస్ కు ఇస్తున్నారు. అంటే.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రతీ పనికి ప్రజలు సహకరిస్తున్నారు. అప్పుడు ప్రగతిభవన్ కట్టేటప్పుడు కూడా ఇలాగే ఏడ్చారు. ఇప్పుడు సెక్రటేరియేట్ కడుతుంటే అవే అరుపులు, పెడబొబ్బలు. ఎన్ని చెప్పినా.. ఏం చేసినా.. ఎన్ని తిట్టినా మీరు మారరు కాంగ్రెస్ నాయకుల్లారా?. మీరు అడ్డంగా పడుకుని నిరసనలు తెలిపినా.. కొత్త సెక్రటేరియేట్ నిర్మాణం మాత్రం ఆగదు. ఉద్దర ముచ్చట్లు ఆపి.. పనికొచ్చే పనులేమైనా ఉంటే చేయండి.

Top