You are here
Home > Uncategorized > పొన్నం… నీకు సిగ్గు లేదా?

పొన్నం… నీకు సిగ్గు లేదా?

Spread the love

 

– రేవంత్ రెడ్డికి పెద్దపీటతో కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి

– రేవంత్ పక్కన పొన్నం పేరుతో తీవ్ర ఆగ్రహజ్వాలలు

– పదవి తిరస్కరించాలంటూ పొన్నంకు సూచనలు

కాంగ్రెస్ లో చాలా కాలంగా ఉంటూ… ఓటమి, గెలుపులకు అతీతంగా రాజకీయాలు చేస్తూ వస్తున్నాడు పొన్నం ప్రభాకర్. విభజన సమయంలో పార్లమెంట్ లో సొంత పార్టీకే వ్యతిరేకంగా గొంతు వినిపించిన నేతల్లో ఆయన కూడా ఒకరు. కానీ… ఇప్పుడేం జరిగింది? కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను నిట్టనిలువునా అవమానించేసింది. పార్టీ కోసం పడిన శ్రమను కూడా అవమానించేస్తూ…రాజకీయ వ్యభిచారి అయిన రేవంత్ పక్కన ఆయన పేరును తగిలించింది.

ఎన్నికల కోసమని.. ఆ పార్టీ అధిష్టానం కొన్ని కొత్త కమిటీలు వేసింది. అందులో భాగంగానే… పీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డితో పాటు… పొన్నం ప్రభాకర్ ను నియమించింది. దీంతో… పార్టీ శ్రేణులు, ముఖ్యంగా కరీంనగర్ కు చెందిన కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పార్టీ కోసం ఆరు గాలం శ్రమించిన పొన్నం కు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ… రేవంత్ తో సమానంగా చూడొద్దని కోరుతున్నారు.

టీఆర్ఎస్ పై చేసిన తప్పుడు ప్రచారానికి ఫలితంగా గత ఎన్నికల్లో ఓడిపోయినా బుద్ధి తెచ్చుకోని పొన్నం ప్రభాకర్ కు తగిన శాస్తే జరిగిందని మరికొందరు నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికైనా మంచిది… తనకు జరిగిన అవమానానికి పొన్నం స్పందించి… పదవిని వదులుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే… రేవంత్ రెడ్డిపై ఉన్నట్టే పొన్నంపై కూడా రాజకీయ వ్యభిచారి అన్న ముద్ర పడడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.

కాంగ్రెస్ కు సంబంధించిన మిగతా కమిటీల సంగతి ఎలా ఉన్నా… పొన్నం మాత్రం కచ్చితంగా ఈ విషయంలో ఆలోచించాల్సిందే అని శ్రేణులు బలంగా పిలుపునిస్తున్నారు. లేదంటే… కరీంనగర్ లో మరోసారి ఓటమికి మానసికంగా సిద్ధపడండి అని కూడా హితవు పలుకుతున్నారు.

Top