You are here
Home > Latest News > కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు గా ఉంది ప్రజాపక్షం పత్రిక విశ్లేషణ. 

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు గా ఉంది ప్రజాపక్షం పత్రిక విశ్లేషణ. 

Spread the love
  • కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు గా ఉంది ప్రజాపక్షం పత్రిక విశ్లేషణ. 
  • బడ్జెట్ పై నిర్మాణాత్మక విమర్శ చేయాలి కానీ ఇలా అక్షర తప్పులను లెక్కిస్తూ విశ్లేషణ చేయడం సిగ్గు చేటు.  
  • పేరేమో ప్రజాపక్షం,పాట పాడేది ప్రతిపక్షం. 
దేశంలో ఆర్థిక మాంద్యం తీవ్రస్థాయిలో ఉన్న కూడా గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు అన్ని వర్గాలను సంతృప్తి చెందించాలానే ఉద్దేశంతో ప్రజాకర్షక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది.ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ తెలంగాణ ముఖ్యమంత్రి ధైర్యంగా ఇటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడంపై ఆర్ధిక రంగ నిపుణులు కెసిఆర్ పనితనాన్ని మెచ్చుకుంటుంటే, పనిలేని ప్రజాపక్షం పత్రిక వాళ్ళు మాత్రం బడ్జెట్లో దొర్లిన అక్షర తప్పులను వెతుకుతూ అదే పెద్ద విశ్లేషణాత్మకమైన కథనంగా పేర్కొంటున్నారు.సిగ్గులేని ప్రజాపక్షం ప్రచురించిన కథనాన్ని చూసిన విశ్లేషకులు కొండను తవ్వి ఎలుకను తెచ్చినట్లు గా ఉంది ప్రజాపక్షం తీరు అని విమర్శిస్తున్నారు.
బడ్జెట్ అంటే ఒక వార్షిక సంవత్సరానికి గాను రాష్ట్ర ఖర్చు మరియు వచ్చే ఆదాయాల ముఖచిత్రం.కొన్ని మేధోమధన సమీక్షల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ని తయారుచేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది.ప్రస్తుతం దేశంలో ఉన్న విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా బడ్జెట్ రూపొందించడం జరిగింది.బడ్జెట్ పై నిర్మాణాత్మక విమర్శలు చేయలేని ప్రజాపక్షం పత్రిక, అక్షర తప్పులను వెతుకుతూ కాలక్షేపం చేస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజా పక్షం తీరుపట్ల విశ్లేషకులు ప్రజా పక్షం పత్రిక పేరుకేమో ప్రజాపక్షం అని పాడే పాట మాత్రం ప్రతి పక్షం అని విమర్శిస్తున్నారు.ఇటువంటి దిక్కుమాలిన కథనాలు చేసి ప్రజాపక్షం పత్రిక తన విలువలను పోగొట్టుకోవడం తప్ప ఒరిగేదేమీ లేదని తెలంగాణ ప్రజలు చెబుతున్నారు.నిజానికి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి మూడు భాషల్లోనూ అద్భుతమైన పట్టు కలిగి ఉన్నారు.తన భాషా పటిమను,చాణక్యతను మళ్ళీ మళ్ళీ రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. అయినా కూడా ప్రజాపక్షం పత్రిక లేడికి లేచిందే పరుగు అన్న విధంగా కథనాలు చేసి సిగ్గు పోగొట్టుకుంటుంది అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
Top