You are here
Home > Uncategorized > రాజాసింగ్​.. మీరు తెలంగాణ తాలిబన్లు!

రాజాసింగ్​.. మీరు తెలంగాణ తాలిబన్లు!

Spread the love

 

రాజాసింగ్​.. మీరు తెలంగాణ తాలిబన్లు!

దేశాన్ని సర్వనాశనం చేస్తున్రు

తెలంగాణపై విషం చిమ్ముతున్నరు

 

నిత్యం మతం మంటలను ఎగదోస్తూ బతికే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​ పతివ్రత మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం బీజేపి ఎమ్మెల్యేలను హౌజ్ అరెస్టు చేయడం అప్రజాస్వామికమట.., మేమేమన్నా ఉగ్రవాదులమా? అంటూ అరుస్తున్నాడు. తెలంగాణ బిల్లుపై ప్రధాని మోడీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడమే గాక తెలంగాణవాదులను రెచ్చగొట్టడానికి రాష్ట్రమంతటా బీజేపీ దొంగ ఆందోళనలు చేస్తోంది. కావాలని తెరాస నాయకులతో, తెలంగాణవాదులతో గొడవ పడుతోంది.

తప్పు చేసినందుకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి బండి సంజయ్​, కిషన్​ రెడ్డి వంటి నాయకులు మరింత రెచ్చిపోతున్నారు. కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. గొడవలు సృష్టిస్తున్నారు. బీజేపీ నాయకులు రాన్రానూ తెలంగాణ తాలిబన్లుగా మారుతున్నారు. తీవ్రవాదుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా దేశ ప్రధాని తెలంగాణ ఉనికినే ప్రశ్నిస్తే మన ప్రజల మనసు గాయపడదా రాజాసింగ్​ ? నువ్వు ఇక్కడ పుట్టలేదా ? పాకిస్తానోడివా ? రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించాల్సిన వ్యక్తి రెండింటి మధ్య పెట్రోల్​ పోస్తే తెరాస ఊర్కోవాలా ? నిరసన తెలిపే హక్కు లేదా ? రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లు కావొస్తున్నది.

2014 ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది తే.. ఆ ఏడాది జూన్‌నుంచి రాష్ర్టాలు అస్తిత్వంలోకి వచ్చాయి. ఆ సమయానికి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది సాక్షాత్తూ మోదీయే. మరి సమాఖ్య స్ఫూర్తిని పదే పదే వల్లెవేసే ప్రధానమంత్రి  రెండు రాష్ర్టాల మధ్య పరస్పర చర్చల ద్వారా పరిష్కారం కాని సమస్యలను పెద్దమనిషిగా తీర్చాల్సిన బాధ్యత లేదా? పోనీ ఆయా రాష్ర్టాలు సమస్యల పరిష్కారానికి విన్నవించినప్పుడైనా చర్యలు తీసుకోవాల్సిన విధి ప్రధానమంత్రిది కాదా? మోడీ పూర్తిగా బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ దేశానికి అత్యున్నతమైన పార్లమెంట్‌ను, అప్పటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌ను అవమానించారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచారు.  రాష్ట్రంపై బీజేపీకి, ప్రధాని మోదీకి ఎంత అక్కసు ఉందో ఆయన వ్యాఖ్యలతో అర్థమవుతున్నది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాబట్టే విభజన హామీలను అమలు చేయడం లేదు.  నోటికి ఏదిస్తే అది మాట్లాడే రాజాసింగ్​ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం నిధులు తీసుకువచ్చారో చెప్పాలి. మోదీ పేదలకు చేసిందేమిటో బయటపెట్టాలి. ఇవన్నీ చేతకాకుంటే నోర్మూసుకొని కూచోవాలి.

Top