You are here
Home > Latest News > రాజేంద్రా??. ఏందీ పని?.

రాజేంద్రా??. ఏందీ పని?.

Spread the love

రాజేంద్రా??. ఏందీ పని?.

  • నీ ఆత్మగౌరవం ఢిల్లీల కుదవ బెడుతున్నవా?.
  • ఆత్మగౌరవం, బీసీ బిడ్డనని బట్టలు చింపుకున్నవ్.
  • చివరికి ఆ వెర్రి పుష్పాల్లో మరో పుష్పం కావాలనుకుంటున్నవ్.
  • ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారావ్ రాజేంద్ర.

ఈటల రాజేందర్.. బీజేపీలో చేరేందుకు సిద్ధమవ్వడం చూసి… ఆయన అనుచరులు కూడా చీ కొడుతున్నారు. ఆస్తులు రక్షించుకునేందుకు, కేసుల నుంచి తప్పించుకునేందుకు.. ఢిల్లీలో మంతనాలు.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరేందుకు చర్చలు చేస్తున్నారు. ఆత్మ గౌరవం కోసం పోరాడతాం.. కేసీఆర్ ను గద్దె దించుతామని.. బండి సంజయ్, కిషన్ రెడ్డి, అర్వింద్, వివేక్, విజయశాంతి లాంటోళ్లు.. రోజూ కారు కూతలు కూస్తూనే ఉన్నారు. కానీ.. ఏళ్లు గడుస్తున్నా.. వాళ్లేం పీకలేక పోతున్నారు. అఫ్ కోర్స్.. రేప్పొద్దున నీ వెంబడి ఉన్న ఏ నాయకుడు కూడా రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదు. బండి సంజయ్, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డికి ఓట్లేసే పరిస్థితి లేదు. చివరికి నీ హుజూరాబాద్ ప్రజలు కూడా నిన్ను చీదరించుకోవడం ఖాయం.

స్వతంత్రంగా ఉంటా.. ఎన్నికలు వస్తే స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని.. ఏదో ఇంటర్వ్యూలో చిలక పలుకులు పలికనట్లు గుర్తు. మరి ఇప్పుడు… ఇంత సడన్ గా కాషాయ గూటికి ఎందుకు పయనం అవుతున్నట్లు. ఎందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాళ్లు పట్టుకుంటున్నట్లు??. ఎందుకంటే.. మాసాయిపేట, దేవరయాంజల్ లో భూముల ఆక్రమణ అనేది వాస్తవం కాబట్టి. తాను చేసింది అక్రమం, అన్యాయం కాబట్టి. ప్రభుత్వం ఆధారాలతో సహా ఎక్కడ బయటపెడుతుందో.. కోర్టు ముందు తాను దోషిగా ఎక్కడ నిలబడాల్సి వస్తుందోనన్న భయంతోనే వెర్రి పుష్పాల గూటికి చేరబోతున్నాడు ఈటల. రాజేంద్రకు మద్దతు తెలిపే నాయకులు కనీసం ఇప్పుడైనా మేలుకోండి.

బీజేపీలో చేరడం ద్వారా కేసీఆర్ ను ఎదరించవచ్చు.. టీఆర్ఎస్ ను ఓడించవచ్చు అని పగటి కలలు కంటున్నడేమో ఈటల. 2018 ఎన్నికల టైంలో.. ప్రధాని మోడీ దగ్గర నుంచి కేంద్ర మంత్రులు.. ఇతర రాష్ట్రాల నాయకులు చాలామంది వచ్చి.. రాష్ట్ర నాయకుల తరపున ప్రచారం చేశారు. ఏం జరిగింది. ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యేను గెలిచింది ఆ పార్టీ. అదికూడా రాజాసింగ్ ను చూసి ఓట్లేశారే తప్ప.. కాషాయ పార్టీని చూసి కాదు. సో.. ఇప్పుడు ఇద్దరున్నారేమో.. అయినా వచ్చే ఎన్నికల్లోనూ ఇదే సింగిల్ డిజిట్ కే బీజేపీ పరిమితం అవుతుంది. అటువంటి పార్టీలో ఈటల చేరడం ద్వారా.. టీఆర్ఎస్ కే లాభం.

Top