You are here
Home > Latest News > వద్దురా బాబూ.. నువ్వూ.. నీ నాటకాలూ!

వద్దురా బాబూ.. నువ్వూ.. నీ నాటకాలూ!

Spread the love

వద్దురా బాబూ.. నువ్వూ.. నీ నాటకాలూ!


– రేవంత్ రెడ్డీ… ప్లీజ్ నువ్వు నటించకు.. చూడలేకపోతున్నాం
– ‘కన్నీళ్ల’ను కూడా అమ్ముకుని వ్యాపారం చేసే ‘వ్యభిచారి’వి నువ్వు
– నువ్వు కతలు పడడం ఆపకుంటే.. ప్రజలే ఆపించేలా ఉన్నారు జాగ్రత్త

రేవంత్ రెడ్డీ… కొన్నాళ్లైనా నోరు మూసుకుని ఉండరా బాబూ. ప్రజల్లో నీపై.. నీ మాటలపై వస్తున్న ఆగ్రహావేశాలు చూస్తే.. న్యూట్రల్ గా ఉండే చాలా మంది భయపడుతున్నారు. ప్రజలు వచ్చి నిన్ను పిచ్చోడిని కొట్టినట్టు.. రాళ్లతో ఎక్కడ తరిమేస్తారేమో అని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే.. నువ్వూ నీ నటన ఆ స్థాయిలో ఉన్నాయి మరి.

నాగులు ఆత్మహత్య యత్నానికి సంబంధించి.. నీ మొసలి కన్నీరు చూస్తే.. ఇలా మాట్లాడాల్సి వస్తోంది అంతా. ఎక్కడైనా.. ఎన్నడైనా.. తెలంగాణ ఉద్యమంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించిన చరిత్ర నీకుందా? అదీ కాక.. తెలంగాణ పదాన్నే శాసనసభలో రద్దు చేసినట్టుగా వ్యవహరించిన చంద్రబాబు దగ్గర రాజకీయ వ్యభిచారిగా పాత్ర పోషించావ్ కదా. ఆ తర్వాత సంగతి చూస్తే.. వందలాది మంది ఆత్మబలిదానాలు చేసుకోవడానకి కారణమైన కాంగ్రెస్ లో చేరావు కదా.

నీ రాజకీయ చరిత్ర అంతా ఇంతే కదా రేవంత్ రెడ్డీ. అలాంటి నువ్వు.. ఇలా కాకుంటే ఇంకెలా మాట్లాడతావ్ లే. నిజంగా కేసీఆర్.. చావు నోట్లో తల పెట్టి పోరాడకుంటే.. తెలంగాణ వచ్చేదా.. యువత చావకూడదని, అవసరమైతే తెలంగాణ కోసం బలిదానం చేసుకుంటా అని కేసీఆర్ ఆనాడు పోరాడిన ఫలితమే తెలంగాణ ఏర్పాటు కాదా? నీ లాంటి రాజకీయ వ్యభిచారులు ఎంత విమర్శలుచేసినా.. ఎన్ని మాటలు అన్నా.. పట్టించుకోని ప్రజలు వరసగా అధికారం అప్పగిస్తున్నది..సంక్షేమాన్ని పొందుతున్నది నిజం కాదా?

అయినా ఎందుకీ పనికిమాలిన మాటలు? ఎందుకీదగుల్బాజీ వేషాలు? కేసీఆర్ కన్నీళ్లనే నువ్వు అవమానించావంటే.. నిన్ను ఎలా శిక్షించాలన్నదికూడా ప్రజాస్వామ్యానికి అర్థం కావడం లేదు. అందుకే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన ప్రజలే.. నీ సంగతి తేలుస్తారు. రాజకీయంగా నీ అంతు చూస్తారు. ఆ సందర్భం కోసం ఎదురు చూడు.

Top