You are here
Home > Uncategorized > రేవంత్​ కొంచెమైనా బుర్రవాడు… రాన్రానూ నీ చిప్ పనిచేయట్లే…

రేవంత్​ కొంచెమైనా బుర్రవాడు… రాన్రానూ నీ చిప్ పనిచేయట్లే…

Spread the love

రేవంత్​ కొంచెమైనా బుర్రవాడు…

రాన్రానూ నీ చిప్ పనిచేయట్లే…

మోడీ వంటి నిరంకుళ పాలకుల వల్ల రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇది కొత్త విషయమూ కాదు. గతంలో కేసీఆర్​ లాగా చాలా మంది మాట్లాడారు. కేసీఆర్​ వాదన కరెక్ట్​ కాదనిపిస్తే ఎలా కాదో చెప్పాలి. ఊరందరిదీ ఒక దారి అయితే రూ.50 కోట్లు పెట్టి పదవి కొనుక్కొన్న రవ్వంత్​ రెడ్డిది మరోదారి. బీజేపీ ప్రోద్బలంతో కేసీఆర్​ ఈ డిమాండ్​ చేశారట!!

ఇంతకంటే అబద్ధం ప్రపంచంలో ఇంక ఇక్కడైనా ఉంటుందా ? ఇంతకంటే ఘోరమైన ఆరోపణ ఉంటుందా ? కేసీఆర్​ పేరు చెబితే బీజేపీ వాళ్లు మండిపడుతున్నారు. కారాలూ మిరియాలూ నూరుతున్నారు. బీజేపీని కూకటివేళ్లత సహా పెకలించాలనే ధ్యేయం ఆయనది. ఇందుకోసం దేశమంతటా తిరుగుతున్నారు. అన్ని పార్టీల చీఫ్​లను కలుస్తున్నారు. థర్డ్​ ఫ్రంట్​ కోసం చిన్నచిన్న పార్టీలకూ నచ్చచెబుతున్నారు. బీజేపీ ఉంటే దేశం ఎన్నటికీ బాగుపడే చాన్సే లేదని ఆయన మన:స్పూర్తిగా నమ్ముతున్నారు. బీజేపీకి మతం మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదు. గుళ్ల మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదు. దేశాన్ని మతం పేరుతో విడదీస్తోంది.

బీజేపీయేతర రాష్ట్రాలకు అన్యాయం చేస్తోంది. ఇవన్నీ సహించలేకే కేసీఆర్​ బీజేపీ వ్యతిరేక పోరాటానికి సారథ్యం వహిస్తున్నారు. రిస్క్ అని తెలిసి కూడా ధైర్యంగా రంగంలోకి దిగారు. రేవంత్​ రెడ్డి ఒక దేడ్ దిమాగ్​ కేసు. నిజంగా రాజ్యాంగాన్ని చదివి ఉంటే రేవంత్​ కేసీఆర్​ మాటలను సమర్థించేవారు. కానీ రవ్వంత రెడ్డి నుంచి రవ్వంత మెచ్యూరిటీని కూడా ఆశించడం సాధ్యం కాదు. రాజకీయ పరిజ్ఞానం లేని మూర్ఖుడు. ఈయనకు కేసీఆర్​ ఆలోచనలు, భావాలు అర్థమవుతాయని అనుకోవడం మూర్ఖత్వం.

Top