You are here
Home > Uncategorized > ఎక్కడ ఎవరు పోయినా జీవోలే కారణమా రేవంతూ ?

ఎక్కడ ఎవరు పోయినా జీవోలే కారణమా రేవంతూ ?

Spread the love

 

ఎక్కడ ఎవరు పోయినా జీవోలే కారణమా రేవంతూ ?

317 జీవో వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి

 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నిన్ననే ఒక అద్భుత విషయం తెలిసింది. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందనీ.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ మృతికి కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన 317 జీవోనే కారణమని తెలిసిపోయింది!  ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే సర్కారు తరపున కనీసం పరామర్శించలేదని ఈయన గుండెలు బాదుకున్నాడు. ఈమధ్య ఎక్కడ ఎవరు మరణించినా కేసీఆర్​ బాధ్యత వహించాలనడం ఫ్యాషన్ అయిపోయింది.

ముఖ్యంగా బండన్న, రవ్వంతు, కడప దొరసాని రోజుకొకసారి అయినా ఈ పదం వాడుతున్నారు. రాష్ట్రం ఇప్పటికే 1.50 లక్షల జాబ్స్​ ఇచ్చిందిరా నాయనలారా అంటే వీళ్లకు అర్థం కావడం లేదు. మరో 50 వేల జాబ్స్​ నోటిఫికేషన్లు ఇస్తార్రా అంటే పట్టదు. ఇక జీవో 317 గురించి చూద్దాం. టీచర్ల బదిలీల కోసం తీసుకొచ్చిన 317జీఓ ప్రకారం కౌన్సెలింగ్ సక్సెస్​ఫుల్​గా పూర్తయింది. అన్ని సంఘాలూ సహకరించాయి. ఆ జీఓ టీచర్లకు వ్యతిరేకంగా ఉంటే కచ్చితంగా పోరుబాట పట్టి ఉండేవి. ప్రపంచంలో ఇంకే సమస్యా లేనట్టు రవ్వంత్​ ఈ ఇష్యూపై బట్టలు చింపుకుంటున్నాడు.

జీఓ నంబర్‌ 317తో జీరో, సింగిల్‌ టీచర్‌తోపాటు డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలకు మహర్దశ లభించింది. ఉమ్మడి జిల్లా కేడర్‌ స్ట్రెంత్‌ ప్రకారం ఉపాధ్యాయుల బదిలీలు జరుగగా.. ప్రక్రియకు ముందు ఏర్పడిన ఖాళీలతోపాటు తాజా ఉద్యోగుల సర్దుబాటుతో ఏర్పడిన ఖాళీలను పరిగణలోకి తీసుకున్నారు. ఆయా పాఠశాలల్లో అవసరాలు, జీఓ మార్గదర్శకాలు అనుసరించి కలెక్టర్‌ ఆదేశాలు, విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల సలహాలతో సర్దుబాటు చేసి పోస్టింగ్‌ ఇచ్చారు.

అయితే స్పౌజ్ బదిలీల్లో మాత్రం కొన్ని సమస్యలు వచ్చాయి. వాటిని పరిష్కరించడానికి సీఎం హామీ ఇచ్చారు. ఇంతటితో కథ సమాప్తమైంది. ఎక్కడ ఏ టీచర్ ఆత్మహత్య చేసుకున్నా ఇదే జీఓ కారణమనడం మూర్ఖత్వం. మరణించిన ప్రతి ఉద్యోగిని ప్రభుత్వం పరామర్శించడం జరిగే పనేనా ?! ఒక ఎంపీ స్థాయి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి??

Top