You are here
Home > Uncategorized > ఆహా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి బాబును, రేవంతును  భలే కాపాడుకుంటున్నాయి…

ఆహా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి బాబును, రేవంతును  భలే కాపాడుకుంటున్నాయి…

Spread the love

 

  • ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అసలు సూత్రధారి అని దేశమంతా తెలుసు..
  • రేవంత్ రెడ్డి.. చంద్రబాబు బినామీ అని ఈ దుష్ట పత్రికలకు తెలియదా?
  • మరి.. ఈ దుష్ట పత్రికలకు బాబు ఎందుకో అంత ప్రేమ…
  • ఇది వాడి అక్రమార్జన కేసుకు సంబంధించింది వాడు ఆదాయపన్ను శాఖకు డబ్బులు కట్టకుండా తిరుగుతుంటే నోటీసులు ఇచ్చింది ఆ శాఖ డానికి దీనికి ఎం సంబంధం ??
  • వాడి ఇంట్లో సోదాలు చేసింది ఐటీ శాఖ దానికి వోటుకు నోటు కేసుకు ముడి పెడుతుంది ఈ దుష్ట పత్రికలూ 

అయినా వాడేమన్న సత్తే పూసనా ?? వాడేదో పతివ్రత అన్నట్టు ఈ కలరింగులు ఏందిరా బాబు ??

ఈనాడు, ఆంధ్రజ్యోతి.. పచ్చ పత్రికలు.. పసుపు పూసుకున్న పత్రికలు చంద్రబాబుకు ఎలా ఊడిగం చేస్తున్నాయో మరోసారి రుజువైంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రథమ ముద్దాయి అని దేశమంతా తెలుసు. చంద్రబాబే దానికి సూత్రధారి అని అందరికీ తెలుసు. చంద్రబాబు బినామీ రేవంత్ రెడ్డి అని కూడా తెలుసు. రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ కు ఇచ్చిన 50 లక్షల రూపాయలను చంద్రబాబు పంపించాడనీ తెలుసు. దానికి సంబంధించిన వీడియో కూడా బయటికి వచ్చింది. అప్పట్లో అదే పెద్ద సంచలనం. చంద్రబాబు ఎంత అవినీతిపరుడో.. ఓట్ల కోసం నాయకులను ఎలా కొంటాడో కూడా దేశమంతా తెలిసిపోయింది.

ఆ కేసు ఇప్పుడు గాడిలో పడింది. ఐటీ అధికారులు ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ప్రశ్నలనే అడుగుతున్నారు. అంటే రేవంత్ అనే బినామీతో అసలు సూత్రధారి చంద్రబాబు లైన్ లోకి రానున్నాడు. బుధవారం జరిగే విచారణకు రేవంత్ హాజరు అవనున్నాడు. దీంతో బాబు డొంక కదలనుంది. ఇక.. ఎక్కడ చంద్రబాబు ఐటీ అధికారుకు దొరికిపోతాడేమోనని ఆయన మానస పుత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి కొత్త పాట అందుకున్నాయి. బాబును డిఫెండ్ చేయడం ప్రారంభించాయి. ఓటుకు నోటు కేసులో బాబు అడ్డంగా బుక్కయినా ఈ దుష్ట పత్రికలు మాత్రం బాబుకు మట్టి అంటకుండా కాపాడుకుంటున్నాయి.

ఇదేం జర్నలిజంరా బాబోయ్. ఇవా సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నది. ఉన్నది ఉన్నట్టు రాయకుండా ఓ వ్యక్తిని కాపాడుతూ జర్నలిజాన్ని కాలరాస్తున్న ఇటువంటి పత్రికలను ఏం చేయాలి? బాబుకు ఏం తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి. చంద్రబాబు అమాయకుడు అని చిత్రీకరించేందుకు అవి చేస్తున్న ప్రయత్నాలు చూసి జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను ఏమాత్రం ఉపయోగపడని… అభివృద్ధిలో సహకరించని ఇటువంటి దుష్టపత్రికలు తెలంగాణకు అవసరమా? ఆంధ్రా బాబును కాపాడటం కోసం తమ ప్రాణాలను సైతం అడ్డేస్తున్న ఈ పచ్చ పత్రికల వల్ల తెలంగాణకు ఒరిగేదేమీ లేదు. ఈ దుష్ట పత్రికలు తెలంగాణకు శనిలా దాపురించాయి. వీటిని తెలంగాణ నుంచి బహిష్కరిస్తేనే తెలంగాణ ప్రశాంతంగా ఉంటుంది.

Top